రంజన్‌కు ‘ఆంగ్లియన్’ చేయూత! | Ranjanku 'Anglian' support! | Sakshi
Sakshi News home page

రంజన్‌కు ‘ఆంగ్లియన్’ చేయూత!

Mar 14 2014 1:05 AM | Updated on Sep 2 2017 4:40 AM

రంజన్‌కు ‘ఆంగ్లియన్’ చేయూత!

రంజన్‌కు ‘ఆంగ్లియన్’ చేయూత!

మిట్టల్ చాంపియన్స్ ట్రస్ట్ (ఎంసీటీ)ను మూసివేయడంతో.

 న్యూఢిల్లీ: మిట్టల్ చాంపియన్స్ ట్రస్ట్ (ఎంసీటీ)ను మూసివేయడంతో... భారత స్టార్ షూటర్ రంజన్ సోధికి ‘ఆంగ్లియన్ మెడల్ హంట్’ స్పోర్ట్స్ కంపెనీ (ఏఎంహెచ్‌సీ) చేయూత ఇచ్చేందుకు ముందుకొచ్చింది.

సోధితో పాటు మరో ఇద్దరు టాప్ అథ్లెట్లతో కూడా ఈ కంపెనీ ఒప్పందం చేసుకోనుంది. ‘రంజన్‌తో ఒప్పందం దాదాపుగా ఖరారైంది. మరో ఇద్దరు అథ్లెట్లు టచ్‌లో ఉన్నారు. అయితే ఈ సమయంలో వాళ్ల పేర్లను వెల్లడించడం పద్ధతి కాదు. ఏదేమైనా త్వరలోనే ఈ ఒప్పందాలు ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. మాది పరిమిత బడ్జెట్. ఎంసీటీ పెద్ద మొత్తంలో ఖర్చు చేసేది. కానీ మేం అథ్లెట్లకు సహాయం చేయాలన్న ఉద్దేశంతో ఉన్నాం’ అని ఏఎంహెచ్‌సీ సీఈఓ మనీష్ బహుగుణ తెలిపారు.

ఆంగ్లియన్ కంపెనీ తనను తీసుకోవడంపై సోధి సంతోషం వ్యక్తం చేశాడు. ఆంగ్లియన్ కంపెనీ మొత్తం 26 మంది క్రీడాకారులతో ఒప్పందం చేసుకుంది. ఇందులో 11 ఏళ్ల కుర్రాళ్లు కూడా ఉన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement