సింధు సారథ్యంలో టీమిండియా..

PV Sindhu To Be The Flag Bearer In Commonwealth Games - Sakshi

కామన్వెల్త్‌ గేమ్స్‌ ప్రారంభవేడుకల్లో భారత బృందానికి నాయకత్వం

న్యూఢిల్లీ : తెలుగు తేజం పీవీ సింధుకు అరుదైన అవకాశం లభించింది. గోల్డ్‌ కోస్ట్‌(ఆస్ట్రేలియా)లో జరుగనున్న కామన్వెల్త్‌ గేమ్స్‌ ప్రారంభోత్స వేడుకలో త్రివర్ణ పతాకాన్ని చేతబట్టి భారత జట్టుకు సారథ్యం వహించనున్నారామె. ఏప్రిల్‌ 4న  కరారా స్టేడియంలో సాయంత్రం 7 గంటల నుంచి (స్థానిక కాలమానం ప్రకారం) ప్రారంభవేడుకలు జరుగుతాయని, ఇందుకోసం అవసరమైన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని నిర్వాహకులు చెప్పారు.

దాదాపు 300 మంది భారత అథ్లెట్లు వివిధ క్రీడాంశాల్లో పాల్గొంటారు. తన కంటే సీనియర్లైన మేరీ కోమ్‌, సైనా నెహ్వాల్‌లు కూడా కామన్వెల్త్‌లో పాల్గొంటున్నప్పటికీ ఈ అవకాశం మాత్రం సింధూకే దక్కడం గమనార్హం. ప్రస్తుతం సింధూ దేశంలోనే గొప్ప అథ్లెట్‌గా గుర్తింపు పొందారని, అందుకే ఆమెకు ఈ బాధ్యతలు అప్పజెప్పామని ఇండియన్‌ ఒలింపిక్‌ అసోసియేషన్‌(ఐఓఏ) అధికారి ఒకరు వ్యాఖ్యానించారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top