ప్రత్యూషకు ఐదో విజయం | Pratyusa to Fifth Victory | Sakshi
Sakshi News home page

ప్రత్యూషకు ఐదో విజయం

Aug 10 2015 3:41 AM | Updated on Sep 3 2017 7:07 AM

ఆసియా కాంటినెంటల్ చెస్ చాంపియన్‌షిప్ మహిళల విభాగంలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి బొడ్డ ప్రత్యూష ఐదో విజయాన్ని నమోదు చేసుకుంది...

అల్ అయిన్ (యూఏఈ): ఆసియా కాంటినెంటల్ చెస్ చాంపియన్‌షిప్ మహిళల విభాగంలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి బొడ్డ ప్రత్యూష ఐదో విజయాన్ని నమోదు చేసుకుంది. భారత్‌కే చెందిన సౌమ్యతో ఎనిమిదో రౌండ్ గేమ్‌లో ప్రత్యూష 53 ఎత్తుల్లో గెలుపొందింది. ప్రస్తుతం ప్రత్యూష ఆరు పాయింట్లతో మరో ఇద్దరితో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో ఉంది. ఓపెన్ విభాగంలోని ఎనిమిదో రౌండ్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ హారిక 48 ఎత్తుల్లో జాంగ్ జోంగ్ (సింగపూర్) చేతిలో ఓడిపోగా... డక్‌హవో ఎన్గుయెన్ (వియత్నాం)తో జరిగిన గేమ్‌ను కోనేరు హంపి 48 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది.

Advertisement
 
Advertisement
Advertisement