ప్రార్థనకు టైటిల్ | prarthana thombare got ITF singles titles | Sakshi
Sakshi News home page

ప్రార్థనకు టైటిల్

May 11 2014 1:56 AM | Updated on Sep 2 2017 7:11 AM

ప్రార్థనకు టైటిల్

ప్రార్థనకు టైటిల్

టాప్ సీడ్ ప్రార్థన తొంబరే తన కెరీర్‌లో రెండో ఐటీఎఫ్ సింగిల్స్ టైటిల్‌ను చేజిక్కించుకుంది.

 ఐటీఎఫ్ జూనియర్ టెన్నిస్
 
 సాక్షి, హైదరాబాద్: టాప్ సీడ్ ప్రార్థన తొంబరే తన కెరీర్‌లో రెండో ఐటీఎఫ్ సింగిల్స్ టైటిల్‌ను చేజిక్కించుకుంది. అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) టోర్నమెంట్ ఫైనల్లో ఆమె ఢిల్లీకి చెందిన రిషిక సుంకరపై గెలిచింది. మొయినాబాద్‌లోని సానియా మీర్జా టెన్నిస్ అకాడమీ (ఎస్‌ఎమ్‌టీఏ)లో శనివారం జరిగిన సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్ ప్రార్థన 6-7, (4/7), 6-4, 6-3తో నాలుగో సీడ్ రిషికపై చెమటోడ్చి నెగ్గింది. ఒక రకంగా ప్రార్థన... డబుల్స్‌లో రిషిక జోడి చేతిలో తనకెదురైన పరాజయానికి బదులు తీర్చుకుంది. శుక్రవారం జరిగిన డబుల్స్ ఫైనల్లో రిషిక-షర్మదా బాలు జంట... ప్రార్థన-శ్వేతా రాణా జోడిని కంగుతినిపించిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement