కెరీర్‌ బెస్ట్‌ ర్యాంక్‌లో ప్రజ్నేశ్‌  | Prajnesh Gunasekaran get the career best rank | Sakshi
Sakshi News home page

కెరీర్‌ బెస్ట్‌ ర్యాంక్‌లో ప్రజ్నేశ్‌ 

Mar 19 2019 1:10 AM | Updated on Mar 19 2019 1:10 AM

Prajnesh Gunasekaran get the career best rank - Sakshi

న్యూఢిల్లీ: ఇండియన్‌ వెల్స్‌ మాస్టర్స్‌ సిరీస్‌–1000 టోర్నమెంట్‌లో విశేషంగా రాణించిన భారత టెన్నిస్‌ ప్లేయర్‌ ప్రజ్నేశ్‌ గుణేశ్వరన్‌ ... సోమవారం విడుదల చేసిన ఏటీపీ పురుషుల సింగిల్స్‌ ర్యాంకింగ్స్‌లో 13 స్థానాలు ఎగబాకాడు. 97వ ర్యాంక్‌ నుంచి 84వ ర్యాంక్‌కు చేరుకొని కెరీర్‌లోనే అత్యుత్తమ స్థానాన్ని అందుకున్నాడు.
 

ఇండియన్‌ వెల్స్‌ టోర్నీలో క్వాలిఫయర్‌ హోదాలో మెయిన్‌ ‘డ్రా’కు అర్హత పొందిన ఈ తమిళనాడు ప్లేయర్‌ మూడో రౌండ్‌కు చేరి 61 ర్యాంకింగ్‌ పాయింట్లను సమకూర్చుకున్నాడు. ప్రజ్నేశ్‌ తర్వాత రామ్‌కుమార్‌ 139వ ర్యాంక్‌లో నిలువగా... గాయం కారణంగా ఆటకు దూరంగా ఉన్న యూకీ బాంబ్రీ 36 స్థానాలు పడిపోయి 207వ ర్యాంక్‌కు చేరాడు.  

Advertisement
 
Advertisement
Advertisement