బీసీసీఐకి గట్టి కౌంటర్‌ ఇస్తాం..! | PCB Would Give A Counter To India In ICC Executive Board Meeting | Sakshi
Sakshi News home page

బీసీసీఐకి గట్టి కౌంటర్‌ ఇస్తాం..!

Feb 27 2019 1:03 PM | Updated on Feb 27 2019 1:14 PM

PCB Would Give A Counter To India In ICC Executive Board Meeting - Sakshi

కరాచీ : ఓవైపు పుల్వామా ఉగ్రదాడి.. మరోవైపు పాక్‌పై సర్జికల్‌ స్ట్రైక్స్‌-2తో భారత్‌ ప్రతీకార దాడితో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. దీంతో వన్డే ప్రపంచకప్‌లో భాగంగా భారత్‌-పాక్‌ మధ్య జరుగనున్న మ్యాచ్‌ల పట్ల సందగ్దం నెలకొంది. టెర్రరిజాన్ని పెంచిపోషిస్తున్న దేశాలను వరల్డ్‌కప్‌ నుంచి బహిష్కరించాలని బీసీసీఐ ఇప్పటికే ఐసీసీకి లేఖ రాసింది. ఇక అభిమానులు, మాజీ క్రికెటర్లు మాత్రం జూన్‌ 16న పాక్‌తో జరిగే మ్యాచ్‌ని బాయ్‌కాట్‌ చేయాలని కోరుతున్నారు. కాగా, దుబాయ్‌లో శుక్రవారం లేదా శనివారం జరుగనున్న ఐసీసీ ఎగ్జిక్యూటివ్‌ బోర్డ్‌ త్రైమాసిక సమావేశంలో భారత్‌-పాక్‌ పంచాయతీ చర్చకు రానుంది.

ఈ సమావేశంలో భారత్‌ అభ్యంతరాలపై పాక్‌ గట్టి కౌంటర్‌ ఇవ్వనుందని సమాచారం. భారత్‌ కోరుకున్నట్టే లీగ్‌ దశలో టీమిండియాతో మ్యాచ్‌లు ఆడమని, కానీ నాకౌట్‌ దశలో ఇరు జట్లు ఎదురుపడితే అప్పుడేం చేస్తారనే ప్రశ్నను పాక్‌ క్రికెట్‌ బోర్డు ఈ సమావేశంలో లేవనెత్తనుందని  పీసీబీలోని  ఓ అధికారి తెలిపారు. దక్షిణాఫ్రికా క్రికెటర్‌పై జాతి విద్వేష వ్యాఖ్యలు చేశాడంటూ పాక్‌ కెప్టెన్‌ సర్పరాజ్‌ఖాన్‌పై నాలుగు మ్యాచ్‌ల నిషేదం విధించిన ఐసీసీ.. తమతో ఆడమని అంటున్న భారత్‌ పట్ల ఎందుకు స్పందించదో ప్రశ్నించనున్నట్టు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement