భారత హాకీ జట్టు కొత్త కోచ్‌గా పాల్ వాన్ యాస్ | Paul van as the new coach of the Indian hockey team | Sakshi
Sakshi News home page

భారత హాకీ జట్టు కొత్త కోచ్‌గా పాల్ వాన్ యాస్

Jan 31 2015 12:41 AM | Updated on Sep 2 2017 8:32 PM

భారత హాకీ జట్టు కొత్త కోచ్‌గా పాల్ వాన్ యాస్

భారత హాకీ జట్టు కొత్త కోచ్‌గా పాల్ వాన్ యాస్

భారత పురుషుల హాకీ జట్టు కొత్త కోచ్‌గా నెదర్లాండ్స్ మాజీ కోచ్ పాల్ వాన్ యాస్‌ను...

న్యూఢిల్లీ: భారత పురుషుల హాకీ జట్టు కొత్త కోచ్‌గా నెదర్లాండ్స్ మాజీ కోచ్ పాల్ వాన్ యాస్‌ను... మహిళల టీమ్‌కు ఆంథోని థోర్న్‌టన్ (న్యూజిలాండ్)ను ఎంపిక చేశారు. టెర్రీ వాల్ష్, నీల్ హావ్‌గుడ్ స్థానంలో ఈ ఇద్దరు బాధ్యతలు తీసుకుంటారు. మూడేళ్ల పాటు (2018) ఈ ఇద్దరు కాంట్రాక్ట్‌లో ఉండనున్నారు.

ఆటగాడిగా వాన్ యాస్‌కు అంతర్జాతీయ అనుభవం తక్కువగా ఉన్నా... కోచ్‌గా నెదర్లాండ్స్ జట్టుకు లండన్ ఒలింపిక్స్‌లో రజతం అందించారు. ఇక నాలుగేళ్ల నుంచి ఆస్ట్రేలియాలోని న్యూసౌత్ వేల్స్ ఇనిస్టిట్యూట్‌లో పనిచేస్తున్న థోర్న్‌టన్ బార్సిలోనా ఒలింపిక్స్‌లో న్యూజిలాండ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement