రెండో రౌండ్‌లో పంకజ్‌ అద్వానీ | Pankaj Advani Sweeps Round Robin Stage at World Snooker Championship | Sakshi
Sakshi News home page

రెండో రౌండ్‌లో పంకజ్‌ అద్వానీ

Nov 24 2017 4:45 AM | Updated on Nov 24 2017 4:45 AM

Pankaj Advani Sweeps Round Robin Stage at World Snooker Championship - Sakshi

ప్రపంచ స్నూకర్‌ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్‌ ప్లేయర్‌ పంకజ్‌ అద్వానీ రెండో రౌండ్‌లోకి ప్రవేశించాడు. దోహాలో జరుగుతున్న ఈ టోర్నీలో గురువారం జరిగిన నాకౌట్‌ తొలి రౌండ్‌లో పంకజ్‌ 4–0 (79–13, 54–2, 139–0, 74–1) ఫ్రేమ్‌ల తేడాతో అహ్మద్‌ సలూమీ (యెమెన్‌)పై విజయం సాధించాడు. లీగ్‌ దశలో గ్రూప్‌ ‘బి’లో పోటీపడిన పంకజ్‌ ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలిచి టాపర్‌గా నిలిచాడు. నాకౌట్‌ మ్యాచ్‌ల్లో టాప్‌ సీడ్‌గా బరిలోకి దిగాడు. భారత్‌కే చెందిన అలోక్‌ కుమార్, లక్ష్మణ్‌ రావత్‌ కూడా నాకౌట్‌ తొలి రౌండ్‌లో గెలిచి ముందంజ వేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement