హార్దిక్ పాండ్యా వర్సెస్ జడేజా! | Pandya and Jadeja fight in dressing room animated video viral | Sakshi
Sakshi News home page

హార్దిక్ పాండ్యా వర్సెస్ జడేజా!

Jun 29 2017 7:46 PM | Updated on Sep 5 2017 2:46 PM

హార్దిక్ పాండ్యా వర్సెస్ జడేజా!

హార్దిక్ పాండ్యా వర్సెస్ జడేజా!

ఇటీవల జరిగిన ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ చేతిలో టీమిండియా ఓటమి చెందగా.. ఓ రనౌట్ మాత్రం చర్చనీయాంశమైంది.

ఇటీవల జరిగిన ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ చేతిలో టీమిండియా ఓటమి చెందగా.. ఓ రనౌట్ మాత్రం చర్చనీయాంశమైంది. రవీంద్ర జడేజాతో సమస్వయ లోపంతో , హార్దిక్ పాండ్యా అవుట్ కాగా అతడు తీవ్ర నిరాశతో వెనుదిరిగాడు. పాండ్యాతో పాటు యావత్ భారతదేశం జడేజా తీరును తీవ్రంగా విమర్శించిన విషయం తెలిసిందే. 'సొంత జట్టు లోపాల వల్లే ఓడిపోయాం. కానీ పాక్‌కు అంత సీన్ లేదని' తాను చేసిన ట్వీట్ వైరల్ కావడంతో పాండ్యా ఆ ట్వీట్‌ను డిలీట్ చేశాడు. అయితే ఈ వివాదాన్ని దృష్టిలో ఉంచుకుని ఓ రూపొందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

రనౌట్ తర్వాత డ్రెస్సింగ్ రూముకి వెళ్లిన పాండ్యా, జడేజా వచ్చిన వెంటనే అతడితో తలపడినట్లుగా ఓ యానిమేషన్ వీడియో రూపొందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. రెజ్లింగ్‌కు సంబంధించి డబ్ల్యూడబ్ల్యూఈలో రెజ్లర్లు తలపడినట్లుగా జడేజా, పాండ్యాలు ఒకరిపై మరొకరు ముష్టిగాథాలతో చెలరేగిపోవడం ఈ వీడియోలో చూడవచ్చు. ఈ సరదా వీడియో అనూహ్యమైన స్పందన వస్తోంది. చివరికి ఎవరు గెలుస్తారన్న సస్పెన్స్‌తో నెటిజన్లు ఈ యానిమేటెడ్ వీడియోను వీక్షిస్తున్నారు.

కాగా, ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లో 339 పరుగుల భారీ లక్ష్యంలో బరిలోకి దిగిన టీమిండియా 54 పరుగులకు సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ సమయంలో క్రీజులోకొచ్చిన యువ సంచలనం హార్దిక్‌ పాండ్యా కేవలం 43 బంతుల్లోనే 4 ఫోర్లు, 6 సిక్సర్లతో 76 పరుగులు చేసి కాసేపు ప్రత్యర్థి పాక్‌కు వణుకు పుట్టించాడు. జడేజా కాల్‌కు స్పందించి పరుగుకు యత్నించి పాండ్యా రనౌట్ కాగా, ఆగ్రహం వ్యక్తం చేస్తూ పెవిలియన్ బాట పట్టాడు. ఈ రనౌట్ కొన్ని రోజులపాటు చర్చనీయాంశమైంది. పాండ్యా మరికాసేపు క్రీజులో ఉంటే ఓటమి అంతరాన్ని తగ్గించేవాడని కామెంట్లు వచ్చాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement