పరుగుల వేటలో పాక్‌పై భారత్‌ బోల్తా | Pakistan beat India to qualify for ACC Emerging Teams Asia Cup final | Sakshi
Sakshi News home page

పరుగుల వేటలో పాక్‌పై భారత్‌ బోల్తా

Nov 21 2019 4:38 AM | Updated on Nov 21 2019 9:54 AM

Pakistan beat India to qualify for ACC Emerging Teams Asia Cup final - Sakshi

ఢాకా: ఆసియా ఎమర్జింగ్‌ కప్‌ అండర్‌–23 క్రికెట్‌ టోర్నమెంట్‌లో టైటిల్‌ ఫేవరెట్‌ భారత జట్టు పోరాటం సెమీఫైనల్లోనే ముగిసింది. పాకిస్తాన్‌తో బుధవారం జరిగిన తొలి సెమీఫైనల్లో టీమిండియా మూడు పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 268 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌నిర్ణిత 50 ఓవర్లలో 8 వికెట్లకు 264 పరుగులు చేసింది. చివరి ఓవర్‌లో భారత్‌ విజయానికి 8 పరుగులు అవసరమయ్యాయి.

అయితే పాక్‌ బౌలర్‌ అమాద్‌ బట్‌ వేసిన ఈ ఓవర్లో భారత్‌ వికెట్‌ కోల్పోవడంతోపాటు కేవలం నాలుగు పరుగులే చేసి ఓటమి చవిచూసింది. భారత ఇన్నింగ్స్‌లో శరత్‌ (47; 6 ఫోర్లు, సిక్స్‌), సనీ్వర్‌ సింగ్‌ (76; 5 ఫోర్లు, సిక్స్‌), అర్మాన్‌ జాఫర్‌ (46; 3 ఫోర్లు, సిక్స్‌) రాణించినా కీలకదశలో అవుట్‌ కావడం దెబ్బ తీసింది. అంతకుముందు పాకిస్తాన్‌ 50 ఓవర్లలో 7 వికెట్లకు 267 పరుగులు సాధించింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement