ఆసియా క్రీడలకు కొన్ని జట్లను పంపకూడదని నిర్ణయించిన భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ)పై ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ (ఓసీఏ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఐఓఏను హెచ్చరించిన ఓసీఏ
న్యూఢిల్లీ: ఆసియా క్రీడలకు కొన్ని జట్లను పంపకూడదని నిర్ణయించిన భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ)పై ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ (ఓసీఏ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈనెల 29న ఈమేరకు ఐఓఏకు ఈమెయిల్ పంపింది. ‘ఫుట్‌బాల్, బాస్కెట్‌బాల్, హ్యాండ్‌బాల్, టేబుల్ టెన్నిస్, సెపక్ తక్రా టీమ్స్‌ను ఆసియాడ్‌కు పంపకూడదని భారత క్రీడాప్రాధికార సంస్థ (సాయ్) ఒత్తిడి చేసినట్టు తెలిసింది. అన్ని క్రీడల డ్రా ఇప్పటికే పూర్తయ్యింది.
ఒకవేళ ఐఓఏ ఉపసంహరణకే మొగ్గు చూపితే కచ్చితంగా పెనాల్టీ ఎదుర్కోవాల్సిందే. ఎందుకంటే మేం తిరిగి కొత్తగా డ్రా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది’ అని ఓసీఏ తెలిపింది. మరోవైపు క్రీడా శాఖ, సాయ్ అధికారుల నిర్వాకం వల్లే భారత్‌లో క్రీడలు నాశనమయ్యే పరిస్థితులు నెలకొన్నాయని ఐఓఏ ప్రధాన కార్యదర్శి నరీందర్ బాత్రా ఆరోపించారు.