ఖాజాగూడలోని ఓక్రిడ్జ్ అంతర్జాతీయ పాఠశాలలో నిర్వహించిన అర్సెనల్ సాకర్ కోచింగ్ క్యాంప్ మంగళవారం ముగిసింది. 6 నుంచి 16 ఏళ్ళలోపు విద్యార్థులకు ఈ శిబిరంలో శిక్షణ ఇచ్చారు.
రాయదుర్గం, న్యూస్‌లైన్: ఖాజాగూడలోని ఓక్రిడ్జ్ అంతర్జాతీయ పాఠశాలలో నిర్వహించిన అర్సెనల్ సాకర్ కోచింగ్ క్యాంప్ మంగళవారం ముగిసింది. 6 నుంచి 16 ఏళ్ళలోపు విద్యార్థులకు ఈ శిబిరంలో శిక్షణ ఇచ్చారు. వారం రోజుల పాటు జరిగిన ఈ క్యాంపులో 78 మంది విద్యార్థులు ఫుట్‌బాల్ నేర్చుకున్నారు. ఇందులో ఆరుగురు విద్యార్థినిలు కూడా ఉన్నారు.
మంగళవారం జరిగిన ముగింపు కార్యక్రమంలో అర్సెనల్ క్లబ్‌కు చెందిన కోచ్ జువాన్ జోన్స్ మాట్లాడుతూ ఫుట్‌బాల్‌కు భారత్‌లో ప్రాచుర్యం కల్పించేందుకు ఈ తరహా శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. విడతల వారిగా మిగతా నగరాల్లో శిక్షణ శిబిరాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓక్రిడ్జ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ హెడ్ డేవిడ్ రాజ్‌కుమార్, ఫుట్‌బాల్ కోచ్‌లు దినేష్, రాము, అల్తిమస్.. ఓక్రిడ్జ్, డీపీఎస్, అజ్మీర్‌కు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. తిరిగి ఈనెల 8వ తేదీ నుంచి 13వ తేదీ వరకు బాచుపల్లిలోని ఓక్రిడ్జ్ అంతర్జాతీయ పాఠశాలలో రెండో విడత శిక్షణ కార్యక్రమం జరగనుంది.