వరల్డ్ యూనివర్సిటీ చెస్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే ఓయూ జట్టుకు సీఆర్‌జీ కృష్ణ సారథ్యం వహిస్తాడు.
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: వరల్డ్ యూనివర్సిటీ చెస్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే ఓయూ జట్టుకు సీఆర్‌జీ కృష్ణ సారథ్యం వహిస్తాడు. ఈ పోటీలు ఆగస్టులో పోలండ్‌లో జరుగుతాయి. ఇటీవల మహారాష్ట్రలోని మహాత్మ పూలే అగ్రికల్చర్ యూనివర్సిటీలో జరిగిన ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ చెస్ చాంపియన్‌షిప్‌లో ఓయూ స్వర్ణం గెలుచుకుంది. వరల్డ్ టోర్నీకి ఓయూ అర్హత సాధించడంపై వైస్ చాన్స్‌లర్ ఎస్.సత్యనారాయణ, ఇంటర్ వర్సిటీ స్పోర్ట్స్ గేమ్స్ కార్యదర్శి ప్రొఫెసర్ ఎల్.బి.లక్ష్మీకాంత్ రాథోడ్, ఓయూ ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ డెరైక్టర్ ప్రొఫెసర్ వడ్డేపల్లి సత్యనారాయణ హర్షం వ్యక్తం చేశారు.
జట్టు: కృష్ణ (కెప్టెన్), ఎస్.రవితేజ, దీప్తాంశ్‌రెడ్డి, విశ్వనాథ్ ప్రసాద్, నిఖిల్‌రెడ్డి, ఆనంద్ నాయక్, కె.కన్నారెడ్డి (కోచ్), శివప్రసాద్ (మేనేజర్).