రజతం నెగ్గిన నిహారిక | Niharika won silver | Sakshi
Sakshi News home page

రజతం నెగ్గిన నిహారిక

Sep 17 2017 1:29 AM | Updated on Sep 19 2017 4:39 PM

రజతం నెగ్గిన నిహారిక

రజతం నెగ్గిన నిహారిక

అహ్మెట్‌ కామెర్ట్‌ కప్‌ యూత్‌ అండర్‌–18 అంతర్జాతీయ బాక్సింగ్‌ టోర్నమెంట్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన హైదరాబాద్‌ బాక్సర్‌ గోనెళ్ల నిహారిక రజత పతకం గెలిచింది.

ఇస్తాంబుల్‌ (టర్కీ): అహ్మెట్‌ కామెర్ట్‌ కప్‌ యూత్‌ అండర్‌–18 అంతర్జాతీయ బాక్సింగ్‌ టోర్నమెంట్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన హైదరాబాద్‌ బాక్సర్‌ గోనెళ్ల నిహారిక రజత పతకం గెలిచింది. ఈ టోర్నీలో భారత బాక్సర్లకు స్వర్ణం, 4 రజతాలు, నాలుగు కాంస్య పతకాలు లభించాయి. 75 కేజీల విభాగంలో పోటీపడిన 16 ఏళ్ల నిహారిక ఫైనల్లో 0–5తో అనస్తాసియా షమోనోవా (కజకిస్తాన్‌) చేతిలో ఓడిపోయింది. భారత్‌ తరఫున సోనియా (48 కేజీలు) స్వర్ణం సాధించగా... అంకుషితా బోరో (60 కేజీలు), పర్వీన్‌ (54 కేజీలు), శశి చోప్రా (57 కేజీలు) రజతాలు గెలిచారు. జ్యోతి గులియా (48 కేజీలు), లలిత, మనీషా (64 కేజీలు), తిలోత్తమ చాను (60 కేజీలు) కాంస్యాలు గెలిచారు.
 

Advertisement

పోల్

Advertisement