ఫార్ములావన్‌కు రోస్‌బర్గ్ గుడ్‌బై | Nico Rosberg announces shock F1 retirement days after world title ... | Sakshi
Sakshi News home page

ఫార్ములావన్‌కు రోస్‌బర్గ్ గుడ్‌బై

Dec 3 2016 12:36 AM | Updated on Aug 1 2018 4:17 PM

ఫార్ములావన్‌కు రోస్‌బర్గ్ గుడ్‌బై - Sakshi

ఫార్ములావన్‌కు రోస్‌బర్గ్ గుడ్‌బై

ఈ ఏడాది ఫార్ములావన్ (ఎఫ్1) రేసింగ్ ప్రపంచ చాంపియన్ నికో రోస్‌బర్గ్ శుక్రవారం సంచలన నిర్ణయం ప్రకటించాడు.

వియన్నా: ఈ ఏడాది ఫార్ములావన్ (ఎఫ్1) రేసింగ్ ప్రపంచ చాంపియన్ నికో రోస్‌బర్గ్ శుక్రవారం సంచలన నిర్ణయం ప్రకటించాడు. తన కెరీర్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు వెల్లడించాడు. గత ఆదివారమే తొలిసారి ఎఫ్1 ప్రపంచ చాంపియన్‌గా అవతరించిన 31 ఏళ్ల రోస్‌బర్గ్ మెర్సిడెస్ జట్టు తరఫున బరిలోకి దిగాడు.

జర్మనీకి చెందిన రోస్‌బర్గ్ పదేళ్లపాటు ఫార్ములావన్‌లో ఉన్నాడు. కెరీర్‌లో 206 రేసుల్లో పాల్గొన్న అతను 23 రేసుల్లో విజేతగా నిలిచాడు. 57 రేసుల్లో టాప్-3లో స్థానాన్ని పొందాడు. 2006లో ఎఫ్1లో బరిలోకి దిగిన రోస్‌బర్గ్‌కు తొలి విజయం మాత్రం 2012లో చైనా గ్రాండ్‌ప్రిలో లభించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement