ఐపీఎల్‌: మరో ఇద్దరు క్రికెటర్ల అరంగేట్రం | Ngidi and KM Asif are making their debut for CSK | Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌: మరో ఇద్దరు క్రికెటర్ల అరంగేట్రం

Apr 30 2018 7:55 PM | Updated on Apr 30 2018 7:59 PM

Ngidi and KM Asif are making their debut for CSK - Sakshi

పుణె: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో భాగంగా ఇక్కడ సోమవారం మహారాష్ట్ర క్రికెట్‌ అసోసియేషన్‌ స్టేడియంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరుగుతున్నమ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన ఢిల్లీ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ‍్యర్‌.. తొలుత చెన్నైను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఇప్పటివరకూ చెన్నై ఏడు మ్యాచ్‌లు ఆడి ఐదింట గెలవగా, ఢిల్లీ ఏడు మ్యాచ్‌లకు గాను రెండింటిలో మాత్రమే విజయ సాధించింది. 

కాగా, గత మ్యాచ్‌ల్లో కోల్‌కతాపై ఢిల్లీ  విజయం సాధించగా, ముంబై చేతిలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఓటమి పాలైంది. ఈ సీజన్‌లో చెన్నై-ఢిల్లీలకు ఇదే తొలి మ్యాచ్‌. ఇదిలా ఉంచితే, ఈ మ్యాచ్‌లో చెన్నై నాలుగు మార్పులతో బరిలోకి దిగుతోంది. శామ్‌ బిల్లింగ్స్‌, ఇమ్రాన్‌ తాహీర్‌, శార్దూల్‌ ఠాకూర్‌, దీపక్‌ చాహర్‌లకు విశ్రాంతినివ్వగా, వారి స్థానాల్లో లుంగి ఎంగిడి, కేఎమ్‌ అసిఫ్‌, కరణ్‌ శర్మ, డుప్లెసిస్‌లకు తుది జట్టులో చోటు దక్కింది.  ఇది ఎంగిడి, కేఎమ్‌ అసిఫ్‌లకు ఐపీఎల్‌ అరంగేట్రపు మ్యాచ్‌. మరొకవైపు ఢిల్లీ ఎటువంటి మార్పులు లేకుండా పోరుకు సిద్ధమైంది.


తుది జట్లు

ఢిల్లీ

శ్రేయస్‌ అయ్యర్‌(కెప్టెన్‌), లియామ్‌ ప్లంకెట్‌, అమిత్‌ మిశ్రా, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌, కోలిన్‌ మున్రో, ట్రెంట్‌ బౌల్ట్‌, విజయ్‌ శంకర్‌, రాహుల్‌ తెవాతియా, అవేశ్‌ ఖాన్‌, రిషబ్‌ పంత్‌, పృథ్వీ షా

చెన్నై

ఎంఎస్‌ ధోని(కెప్టెన్‌), షేన్‌ వాట్సన్‌, డ్వేన్‌ బ్రేవో, సురేశ్‌ రైనా, రవీంద్ర జడేజా, అంబటి రాయుడు, కరణ్‌ శర్మ, డుప్లెసిస్‌, ఎంగిడి, కేఎమ్‌ అసిఫ్‌, హర్భజన్‌ సింగ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement