ఎవరెస్ట్‌పైకి హ్యూస్ బ్యాట్ | Nepal to place Phil Hughes' bat atop Mount Everest | Sakshi
Sakshi News home page

ఎవరెస్ట్‌పైకి హ్యూస్ బ్యాట్

Dec 27 2014 12:13 AM | Updated on Sep 2 2017 6:47 PM

మైదానంలో బంతి తగిలి మరణించిన ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిల్ హ్యూస్‌కు నేపాల్ క్రికెట్ సంఘం (సీఏఎన్) ఘనంగా నివాళి అర్పించనుంది.

మెల్‌బోర్న్: మైదానంలో బంతి తగిలి మరణించిన ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిల్ హ్యూస్‌కు నేపాల్ క్రికెట్ సంఘం (సీఏఎన్) ఘనంగా నివాళి అర్పించనుంది. హ్యూస్ ఆడిన ఏదైనా ఒక బ్యాట్, అతని క్రికెట్ దుస్తులను తమకు ఇస్తే వాటిని ఎవరెస్ట్ శిఖరంపైకి చేరుస్తామని సీఏఎన్... ఆస్ట్రేలియా బోర్డు (సీఏ)కు లేఖ రాసింది. దీనికి సీఏ స్పందించింది. మార్చి-ఏప్రిల్ నెలలో ఎవరెస్ట్ ఎక్కే సీజన్ సమయానికి సీఏ అధికారులు హ్యూస్ బ్యాట్‌ను నేపాల్‌కు పంపుతారు.
 
 కామెంటేటర్‌గా ఆకట్టుకున్న క్లార్క్
 గాయం కారణంగా క్రికెట్ కెరీర్ సందేహంలో పడినా... ఆస్ట్రేలియా స్టార్ మైకేల్ క్లార్క్ కొత్త కెరీర్‌లో నిలదొక్కుకోవచ్చు. భారత్, ఆస్ట్రేలియాల మూడో టెస్టు తొలి రోజున కామెంటేటర్ అవతారం ఎత్తిన క్లార్క్ ఆకట్టుకున్నాడు. భారత బౌలర్లు షమీ, ఉమేశ్‌లను క్లార్క్ కామెంటరీలో ప్రశంసించాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement