డివిలియర్స్, ఆమ్లా రికార్డు బద్దలుకొట్టాడు!
కెరీర్ ప్రారంభించిన ఏడాదిలోనే దక్షిణాఫ్రికా బౌలర్ కగిసో రబాడా సంచలనాలు నమోదుచేశాడు.
జోహన్నెస్ బర్గ్: కెరీర్ ప్రారంభించిన ఏడాదిలోనే దక్షిణాఫ్రికా బౌలర్ కగిసో రబాడా సంచలనాలు నమోదుచేశాడు. దక్షిణాఫ్రికా బోర్డు ప్రదానం చేసిన వార్షిక అవార్డులలో ఏకంగా ఆరింటిని కైవసం చేసుకుని, సహచరులు హషీం ఆమ్లా(5), ఏబీ డివిరియర్స్(5) పేరిట ఉన్న రికార్డును బద్దలుకొట్టాడు. అవార్డుల ప్రదానం తర్వాత రబాడా మీడియాతో మాట్లాడాడు. భారత్లోనే తాను అత్యుత్తమంగా రాణించానని, యంగెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు సొంతం చేసుకున్న రబాడా పేర్కొన్నాడు. టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్, వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్, దక్షిణాఫ్రికా ప్లేయర్ ఆఫ్ ద ఇయర్, సఫారీ ఫ్యాన్స్ ప్లేయర్, బెస్ట్ డెలివరీ ఆఫ్ ద ఇయర్ విభాగాలలో అవార్డులు సొంతం చేసుకున్నాడు.
60 వేల మంది అభిమానులు రబాడా ఓటు వేసి రబాడాకు అగ్రస్థానం అందించారు. వాండరర్స్ స్డేడియంలో ఇంగ్లండ్ ఆటగాడు జాసన్ రాయ్ ని ఓట్ చేసిన డెలివరికి బెస్ట్ డెలివరి బౌలర్ గా అవార్డు అందుకున్నాడు. అయితే అరంగేట్రం చేసిన తర్వాత తొలి ఆరు మ్యాచులలో ఏకంగా 24 వికెట్లు తీసిన ఈ బౌలర్ ఓవరాల్ గా 20 వన్డేలలో 4.78 బెస్ట్ ఎకానమీ రేటుతో 37 వికెట్లు తీశాడు. తొలిటెస్టులోనే సెంచరీ చేసిన స్టీఫెన్ కుక్ న్యూ కమర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గెలుచుకున్నాడు.