జూలు విదిల్చిన పొలార్డ్‌.. పంజాబ్‌కు భారీ లక్ష్యం 

Mumbai Indians Set Target Of 187 Runs Against KXIP  - Sakshi

విజృంభించిన ఆండ్రూ టై

రాణించిన కృనాల్‌ పాండ్యా

ముంబై : ఎట్టకేలకు ముంబై ఇండియన్స్‌ ఆల్‌రౌండర్‌ కీరన్‌ పోలార్డ్‌ జూలు విదిల్చాడు. కింగ్స్‌ పంజాబ్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో అర్ధ సెంచరీతో జట్టుకు అండగా నిలిచాడు. ఈ ఆల్‌రౌండర్‌కు తోడుగా కృనాల్‌ పాండ్యా రాణించడంతో ముంబై, పంజాబ్‌కు 187 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబైకి ఓపెనర్లు శుభారంభం అందించారు. అయితే ఆండ్రూ టై, ఓపెనర్‌ ఎవిన్‌ లూయిస్‌(9)ను క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన ఇషాన్‌ కిషాన్‌.. దాటిగా ఆడాడు. దీంతో 5 ఓవర్లకు ముంబై 50 పరుగులు పూర్తి చేసింది. మరోసారి టై విజృంభించడంతో జోరు మీదున్న ఇషాన్‌ కిషాన్(20 : 12 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్స్‌లు‌)‌, సూర్యకుమార్‌ యాదవ్‌(27: 15 బంతుల్లో 3 ఫోర్‌, 2 సిక్స్‌లు)లు వరుస బంతుల్లో పెవిలియన్‌ చేరారు.  దీంతో ముంబై ఇండియన్స్‌ 59 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఆ వెంటనే రోహిత్‌ శర్మ(6) సైతం పెవిలియన్‌ చేరాడు. 

ఆదుకున్న కృనాల్‌- పొలార్డ్‌ 
ఈ తరుణంలో క్రీజులోకి వచ్చిన పోలార్డ్‌, కృనాల్‌ పాండ్యాలు ఆచితూచి ఆడుతూ.. ముంబై ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. వీలు చిక్కిన బంతిని బౌండరీలకు తరలిస్తూ.. స్కోర్‌ బోర్డ్‌ పరుగెత్తించారు. 65 పరుగులు భాగస్వామ్యం అనంతరం రాజ్‌పుత్‌ బౌలింగ్‌లో కృనాల్‌(32: 23 బంతుల్లో,1 ఫోర్‌,1 సిక్స్‌) అనవసర షాట్‌కు ప్రయత్నించి క్యాచ్‌ ఔట్‌గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో పోలార్డ్‌ 22 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక పొలార్డ్‌కు ఈ సీజన్‌లో ఇదే తొలి అర్ధ సెంచరీ కావడం విశేషం. అశ్విన్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించిన పోలార్డ్‌ 50( 23బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఫించ్‌కు చిక్కాడు. ఆ వెంటనే కటింగ్‌ (4), హార్దిక్‌ పాండ్యా(9) సైతం పెవిలియన్‌ చేరారు. చివర్లో మెక్లీగన్‌ (11 నాటౌట్‌), మయాంక్‌ మార్కండే (7 నాటౌట్‌)లుగా నిలవడంతో ముంబై నిర్ణీత 20 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది. ఇక పంజాబ్‌ బౌలర్లలో ఈ సీజన్‌లో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న ఆండ్రూ టై మరోసారి (4/16) చెలరేగగా.. అశ్విన్‌(2/18), రాజ్‌పుత్‌, స్టోయినిస్‌లు తలో వికెట్‌ తీశారు.

మరిన్ని వార్తలు

05-12-2018
Dec 05, 2018, 11:19 IST
సాక్షి, మిర్యాలగూడ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆర్థిక దోపిడీ పెరిగిందని సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి...
13-06-2018
Jun 13, 2018, 09:18 IST
ముంబై : తండ్రి అయినప్పటి నుంచి క్రికెటర్‌గా తనలో మార్పు వచ్చిందో.. లేదో కానీ.. వ్యక్తిగా మాత్రం ఎంతో మారానని టీమిండియా...
03-06-2018
Jun 03, 2018, 15:17 IST
ముంబై : టీమిండియా ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ మైదానంలో వినూత్నంగా సంబరాలు చేసుకుంటూ అభిమానులను అలరిస్తుంటాడు. క్యాచ్‌ పట్టిన అనంతరం...
31-05-2018
May 31, 2018, 09:21 IST
సాక్షి, చెన్నై : ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) -11లో ఒక్కో జట్టుది ఒక్కో అనుభవం. అయితే విజేతగా నిలిచిన...
30-05-2018
May 30, 2018, 14:49 IST
ముంబై : ఐపీఎల్‌-11 సీజన్‌లో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఇచ్చిన బ్యాట్‌తోనే రాణించానని హైదరాబాది ఆటగాడు అంబటి రాయుడు...
30-05-2018
May 30, 2018, 09:59 IST
సాక్షి, న్యూఢిల్లీ : ఐపీఎల్‌-11 విజేత చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు యాజమాన్యంపై ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ మాజీ కెప్టెన్‌ గౌతమ్‌...
30-05-2018
May 30, 2018, 08:43 IST
సాక్షి, చెన్నై : ఐపీఎల్‌ –2018 సుల్తాన్‌గా చెన్నై సూపర్‌ కింగ్స్‌ అవతరించిన విషయం తెలిసిందే. అద్భుతమైన ఫీల్డింగ్, బౌలింగ్‌...
29-05-2018
May 29, 2018, 18:03 IST
న్యూఢిల్లీ : టీమిండియా ఆటగాళ్లు హర్భజన్‌ సింగ్‌, అంబటి రాయుడు ఐపీఎల్‌ ఆరంభం నుంచి 2017 సీజన్‌ వరకు ముంబై...
29-05-2018
May 29, 2018, 16:17 IST
ముంబై : ఐపీఎల్‌-11 సీజన్‌లో తన బ్యాట్‌తో అభిమానులను అలరించాడు వెస్టిండీస్‌ విధ్వంసకర్‌ బ్యాట్స్‌మన్‌ క్రిస్‌గేల్‌. అయితే ఓ చానెల్‌...
29-05-2018
May 29, 2018, 13:26 IST
ముంబై: ఒకరి విజయం వందలమందికి స్ఫూర్తినిస్తుంది. నిత్యం బాంబుల మోతమోగే అఫ్ఘాన్‌ నేలపై క్రికెట్‌ ఓనమాలు దిద్దిన రషీద్‌ ఖాన్‌.....
29-05-2018
May 29, 2018, 10:24 IST
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌.... ఐపీఎల్‌లో అత్యధిక విజయాలరేటు నమోదు చేసిన జట్టు... లీగ్‌ దశలో టేబుల్‌ టాపర్‌... ప్లే ఆఫ్‌ బెర్తు...
28-05-2018
May 28, 2018, 20:10 IST
సాక్షి, స్పోర్ట్స్‌ : ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ -11వ సీజన్‌లో త్రీ రన్స్‌ చాలెంజ్‌ బాగా పాపులర్‌ అయింది. చెన్నై...
28-05-2018
May 28, 2018, 17:57 IST
హైదరాబాద్‌ : ఐపీఎల్‌-11 సీజన్‌ ఫైనల్‌ అనంతరం ఇద్దరి ఆటగాళ్లపై సోషల్‌ మీడియా వేదికగా తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ...
28-05-2018
May 28, 2018, 16:03 IST
ముంబై : ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న అఫ్గానిస్తాన్ సంచలనం రషీద్ ఖాన్.. ఇప్పడు హాట్ టాపిక్ అయ్యాడు....
28-05-2018
May 28, 2018, 15:48 IST
ముంబై: ఐపీఎల్‌-11 సీజన్‌ ఫైనల్లో తమ ఓటమికి చెన్నై సూపర్‌ కిం‍గ్స్‌ ఆటగాడు షేన్‌ వాట్సనే కారణమని సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌...
28-05-2018
May 28, 2018, 15:40 IST
ముంబై: ఈ ఐపీఎల్‌ సీజన్‌ ఆరంభంలో టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన  కెప్టెన్‌గా రికార్డులకెక్కిన ఎంఎస్‌ ధోని.. సన్‌రైజర్స్‌తో ఆదివారం...
28-05-2018
May 28, 2018, 13:46 IST
ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)-11వ సీజన్‌ ముగిసింది.
28-05-2018
May 28, 2018, 12:48 IST
ముంబై: ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆటగాడు షేన్‌ వాట్సన్‌ కొత్త అధ్యాయాన్ని లిఖించాడు. ఐపీఎల్‌ ఫైనల్స్‌లో భాగంగా ఛేజింగ్‌లో...
28-05-2018
May 28, 2018, 11:46 IST
ముంబై: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ పేసర్‌ సిద్దార్థ్‌ కౌల్‌ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఓవరాల్‌ ఐపీఎల్‌ చరిత్రలోనే...
28-05-2018
May 28, 2018, 11:34 IST
ముంబై: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)-11వ సీజన్‌లో ఐదు శతకాలు నమోదయ్యాయి. అందులో నాలుగు శతకాలు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పైనే రావడం ఒకటైతే,...
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top