‘ధోనికి ఆ సలహా ఇచ్చింది నేనే’ | MSK Prasad suggestion to MS Dhoni | Sakshi
Sakshi News home page

‘ధోనికి ఆ సలహా ఇచ్చింది నేనే’

Sep 27 2016 5:49 PM | Updated on Sep 4 2017 3:14 PM

‘ధోనికి ఆ సలహా ఇచ్చింది నేనే’

‘ధోనికి ఆ సలహా ఇచ్చింది నేనే’

ఆంధ్రా క్రికెట్ నుంచి చాలా తీసుకున్నానని ఇప్పుడు కొంత తిరిగిచ్చే సమయం వచ్చిందని బీసీసీఐ సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ అన్నారు.

విజయవాడ: ఆంధ్రా క్రికెట్ నుంచి చాలా తీసుకున్నానని ఇప్పుడు కొంత తిరిగిచ్చే సమయం వచ్చిందని బీసీసీఐ సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ అన్నారు. రాబోయే తరాలు గుర్తుంచుకునేలా టీమిండియా జట్టును ఎంపిక చేస్తానని చెప్పారు. ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ మంగళవారం విజయవాడలో ఆయనను ఘనంగా సత్కరించింది.

ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ... టీమిండియా చీఫ్‌ సెలక్టర్‌గా ఎంపిక కావడం తన జీవితంలో మరుపురాని ఘటనగా పేర్కొన్నారు. ప్రతిభ ఆధారంగా ఆటగాళ్లను ఎంపిక చేస్తానని, జట్టు ఎంపికలో తనదైన ముద్ర వేస్తానని హామీయిచ్చారు. వికెట్ కీపింగ్ పై దృష్టి పెట్టమని మహేంద సింగ్ ధోనికి తానే చెప్పానని వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల నుంచి మరింత మంది జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తారన్న ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement