‘మరో పెళ్లి చేసుకోవడానికి పిచ్చోడినా’

Mohammed Shami gives stinging reply to estranged wife Hasin Jahan after latest allegation - Sakshi

ఆమ్రోహా: టీమిండియా క్రికెటర్ మహ్మద్ షమీ, ఆయన భార్య హసీన్ జహాన్‌ల మధ్య సంబంధాలు దెబ్బతిన్న సంగతి తెలిసిందే. ఈ ఫాస్ట్‌ బౌలర్‌పై గతంలో తీవ్ర విమర్శలు ఎక్కుబెట్టిన జహన్.. ఇటీవల మరో బాంబు పేల్చింది. రంజాన్ తర్వాత అతడు మరో పెళ్లి చేసుకోబోతున్నాడని ఆరోపించింది. పండుగ అయిపోయిన ఐదు రోజుల తర్వాత షమీ నిఖా చేసుకోబోతున్నాడని వ్యాఖ్యానించింది.

తాజా ఆరోపణల విషయమై షమీ ఘాటుగా స్పందించాడు. ‘ఒక్క పెళ్లి చేసుకొనే నానా ఇబ్బందులు పడుతుంటే.. రెండో పెళ్లా? మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి నేనేమైనా పిచ్చోడిలా కనిపిస్తున్నానా? అని షమీ బదులిచ్చాడు.

‘హసీన్ గత కొద్ది నెలలుగా నాపై బోలెడన్ని విమర్శలు చేసింది. నేను పెళ్లి చేసుకోబోతున్నాను అనేది కూడా అందులో ఒకటి. నా రెండో పెళ్లికి ఆమెను ఆహ్వానిస్తా’నంటూ షమీ వ్యంగ్యంగా మాట్లాడాడు. ఇటీవల కుటుంబ సమస్యల కారణంగా తన ప్రదర్శన బాగోలేదని, ఇంగ్లండ్ పర్యటనలో పరిస్థితి మారుతుందని షమీ ఆశాభావం వ్యక్తం చేశాడు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top