మిథాలీ రాజ్‌ మరో రికార్డు | Mithali Raj gets record fifty in third one day against England | Sakshi
Sakshi News home page

మిథాలీ రాజ్‌ మరో రికార్డు

Apr 12 2018 8:34 PM | Updated on Apr 12 2018 8:51 PM

Mithali Raj gets record fifty in third one day against England - Sakshi

నాగ్‌పూర్‌: ఇటీవల అత్యధిక వన్డేలు ఆడిన ఘనతను తన పేరిట లిఖించుకున్న భారత మహిళా వన్డే కెప్టెన్‌ మిథాలీ రాజ్‌..తాజాగా మరో  రికార్డు సాధించింది. అంతర్జాతీయ మహిళా వన్డే క్రికెట్‌లో అత్యధిక హాఫ్‌ సెంచరీలు నమోదు చేసిన రికార్డును సొంతం చేసుకుంది. ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డేలో మిథాలీ రాజ్‌(74 నాటౌట్‌) హాఫ్‌ సెంచరీ సాధించడంతో 56 అర్థ శతకాలతో కొత్త అధ్యాయాన్ని లిఖించింది.

ఈ క‍్రమంలోనే ఇప్పటివరకూ ఇంగ్లండ్‌ మాజీ క్రీడాకారిణి ఎడ్వర్డ్స్‌ పేరిట ఉన్న 55 హాఫ్‌ సెంచరీల రికార్డును మిథాలీ బ్రేక్‌ చేసింది. అంతకుముందు ఇంగ్లండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌ ద్వారా అత్యధిక వన్డేలు ఆడిన మహిళా క్రికెటర్‌ రికార్డును మిథాలీ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంచితే, ఇంగ్లండ్‌తో జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో భారత్‌ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఫలితంగా మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో సాధించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement