మీరాబాయికి నాలుగో స్థానం

Mirabai Chanu Finishes Fourth In World Championship - Sakshi

ప్రపంచ వెయిట్‌లిఫ్టింగ్‌ చాంపియన్‌షిప్‌

పట్టాయా (థాయ్‌లాండ్‌): మాజీ చాంపియన్‌ లిఫ్టర్‌ మీరాబాయి చాను ప్రపంచ వెయిట్‌ లిఫ్టింగ్‌ చాంపియన్‌షిప్‌లో పతకానికి దూరమైంది. మహిళల 49 కేజీల ఈవెంట్‌లో గురువారం పోటీపడిన ఆమె 201 కేజీల బరువెత్తింది. వ్యక్తిగతంగా ఇది అత్యుత్తమ ప్రదర్శనే కానీ పతకాన్ని మాత్రం తెచి్చపెట్టలేకపోయింది. ఈ ఏప్రిల్‌లో జరిగిన ఆసియా చాంపియన్‌షిప్‌లో 25 ఏళ్ల మీర స్నాచ్‌లో 88 కేజీలు, క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 111 కేజీలు,  మొత్తం కలిపి 199 కేజీల బరువెత్తింది. ఇక్కడ 87 కేజీలు+114 కేజీలు కలిపి మొత్తంగా 201 కేజీలు ఎత్తినా నాలుగో స్థానంతోనే తృప్తిపడింది.

చైనా లిఫ్టర్‌ జియాంగ్‌ హుయిహువా 212 (94+118) కేజీలతో కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పింది. తమ దేశానికే చెందిన హౌ జిహుయి (210 కేజీలు) రికార్డును చెరిపేసింది. హౌ జిహుయి 211 (94+117) కేజీల బరువెత్తి రజతం నెగ్గగా, నార్త్‌ కొరియా లిఫ్టర్‌ రి సంగ్‌ గమ్‌ 204 (89+115) కేజీలతో కాంస్యం గెలుచుకుంది.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top