హామిల్టన్‌కు ఆరో ‘పోల్’ | Mercedes' Lewis Hamilton on pole for British Grand Prix at Silverstone | Sakshi
Sakshi News home page

హామిల్టన్‌కు ఆరో ‘పోల్’

Jul 10 2016 3:50 AM | Updated on Sep 4 2017 4:29 AM

హామిల్టన్‌కు ఆరో ‘పోల్’

హామిల్టన్‌కు ఆరో ‘పోల్’

సొంతగడ్డపై మరోసారి సత్తా చాటుకునేందుకు బ్రిటన్ ఫార్ములావన్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ సిద్ధమయ్యాడు...

నేడు బ్రిటిష్ గ్రాండ్‌ప్రి
సిల్వర్‌స్టోన్ (ఇంగ్లండ్): సొంతగడ్డపై మరోసారి సత్తా చాటుకునేందుకు బ్రిటన్ ఫార్ములావన్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ సిద్ధమయ్యాడు. ఆదివారం జరిగే బ్రిటిష్ గ్రాండ్‌ప్రి ప్రధాన రేసును ప్రస్తుత ప్రపంచ చాంపియన్ హామిల్టన్ తొలి స్థానం నుంచి ప్రారంభించే అవకాశాన్ని దక్కించుకున్నాడు. శనివారం జరిగిన క్వాలిఫయింగ్ సెషన్‌లో మెర్సిడెస్ జట్టుకు చెందిన హామిల్టన్ అందరికంటే వేగంగా ఒక నిమిషం 29.287 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేసి ఈ సీజన్‌లో ఆరోసారి ‘పోల్ పొజిషన్’ను సంపాదించాడు. మెర్సిడెస్ జట్టుకే చెందిన నికో రోస్‌బర్గ్ రేసును రెండో స్థానం నుంచి మొదలుపెడతాడు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా డ్రైవర్లు హుల్కెన్‌బర్గ్, సెర్గియో పెరెజ్ వరుసగా తొమ్మిది, 11వ స్థానాల నుంచి రేసును ప్రారంభిస్తారు.
 
నేటి ప్రధాన రేసు సా.గం. 5.25 నుంచి స్టార్ స్పోర్ట్స్-4లో ప్రత్యక్ష ప్రసారం

Advertisement
 
Advertisement
Advertisement