
బోల్ట్‌ను మించిన వేగం
ఆస్ట్రేలియాకు చెందిన ఓ స్కూల్ కుర్రాడు... జమైకా పరుగుల వీరుడు ఉసేన్ బోల్ట్ కంటే వేగంగా పరుగెత్తుతున్నాడు. వినడానికి ఇది ఆశ్చర్యంగా ఉన్నా వాస్తవంగా మాత్రం నిజం.
మెల్‌బోర్న్: ఆస్ట్రేలియాకు చెందిన ఓ స్కూల్ కుర్రాడు... జమైకా పరుగుల వీరుడు ఉసేన్ బోల్ట్ కంటే వేగంగా పరుగెత్తుతున్నాడు. వినడానికి ఇది ఆశ్చర్యంగా ఉన్నా వాస్తవంగా మాత్రం నిజం. టౌన్స్‌విల్లేలో వారాంతంలో జరిగిన ఓ ప్రదర్శనలో 14 ఏళ్ల జేమ్స్ గల్హార్ (న్యూసౌత్‌వేల్స్) 200 మీటర్ల పరుగును 21.73 సెకన్లలో ముగించి రికార్డు సృష్టించాడు.
అతని ఏజ్ గ్రూప్‌లో ఇది కొత్త రికార్డు. 14 ఏళ్ల వయసులో బోల్ట్ 200 మీ. పరుగును పూర్తి చేసిన సమయం (21.81)కంటే... 0.08 సెకన్ల తక్కువ సమయంలోనే ఈ కుర్రాడు రేసును పూర్తి చేశాడు. దీంతో 2016 రియో ఒలింపిక్స్‌కు అతన్ని ఎంపిక చేయాలనే ప్రతిపాదన వచ్చింది.