స్పిన్ సంచలనం అరుదైన రికార్డులు | Mayank Markande Is Third Youngest player For 4 Wickets In IPL | Sakshi
Sakshi News home page

స్పిన్ సంచలనం అరుదైన రికార్డులు

Apr 13 2018 3:55 PM | Updated on Apr 13 2018 5:30 PM

Mayank Markande Is Third Youngest player For 4 Wickets In IPL - Sakshi

సాక్షి, హైదరాబాద్ : ఐపీఎల్‌ 11లో సంచలన బౌలర్లలో లెగ్ స్పిన్నర్ మయాంక్ మార్కండే ఒకరు. ఈ సీజన్లో ఆడింది కేవలం రెండంటే రెండు మ్యాచ్‌లే. కానీ అతడు ప్రత్యర్థులకు సంధించిన బంతులు చూస్తే మాత్రం ఎంతో అనుభవజ్ఞుడిలా కనిపిస్తాడు. ఇందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు. చెన్నై సూపర్ కింగ్స్‌ (సీఎస్‌కే)తో మ్యాచ్‌లో మయాంక్ అద్బుతంగా బౌలింగ్ చేయడంతో ఓ దశలో ముంబై ఇండియన్స్ కు విజయం నల్లేరుపై నడక అన్నట్లుగా కనిపించింది. ఆ మ్యాచ్లో మూడు వికెట్లు తీసిన మయాంక.. గురువారం సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో భాగంగా నాలుగు వికెట్లు (4/23) తీసి అరుదైన రికార్డులు నమోదు చేశాడు.

సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీసిన మార్కండే అతిపిన్న వయసు (20 ఏళ్ల 152 రోజులు)లో ఈ ఫీట్ నెలకొల్పిన మూడో ఆటగాడిగా నిలిచాడు. దాంతో పాటు 2016 ఐపీఎల్ నుంచి ఓ జట్టు టాపార్డర్ 5 వికెట్లలో 4 వికెట్లు తీసిన ఐదో బౌలర్ గా మార్కండే గుర్తింపు సాధించాడు. గూగ్లీలతో టాప్ బ్యాట్స్‌మెన్లను ఉక్కిరి బిక్కిరి చేసి సన్‌రైజర్స్‌ శిబిరంలో ఆందోళన రేకెత్తించాడు.

ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో ఏడు వికెట్లు తీసిన ముంబై బౌలర్ మార్కండే పర్పుల్ క్యాప్ ను దక‍్కించుకున్నాడు. మరొకవైపు రెండు మ్యాచ్‌ల తర్వాత మార్కండే 6.57 బౌలింగ్ సగటుతో కొనసాగడం విశేషం. అదే సమయంలో అతి ఎక్కువ డాట్ బాల్స్ వేసిన బౌలర్లలో మార్కండే ఒకరు. 45.83 శాతం బంతులను డాట్ బాల్స్‌గా వేయడం గమనార్హం.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement