దులీప్ ట్రోఫీ మ్యాచ్‌కు వర్షం అడ్డంకి | Mayank Agarwal, Gautam Gambhir hit fifties for India Blue on truncated day | Sakshi
Sakshi News home page

దులీప్ ట్రోఫీ మ్యాచ్‌కు వర్షం అడ్డంకి

Aug 30 2016 12:22 AM | Updated on Sep 4 2017 11:26 AM

దులీప్ ట్రోఫీ మ్యాచ్‌కు వర్షం అడ్డంకి

దులీప్ ట్రోఫీ మ్యాచ్‌కు వర్షం అడ్డంకి

ఇండియా బ్లూ, రెడ్ జట్ల మధ్య ప్రారంభమైన దులీప్ ట్రోఫీ రెండో లీగ్ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది.

ఇండియా బ్లూ 105/0  
గ్రేటర్ నోయిడా: ఇండియా బ్లూ, రెడ్ జట్ల మధ్య ప్రారంభమైన దులీప్ ట్రోఫీ రెండో లీగ్ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. భారీ వర్షం కారణంగా తొలి రోజు సోమవారం 34.2 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇండియా ‘బ్లూ’ మ్యాచ్ నిలిచిపోయే సమయానికి వికెట్ నష్టపోకుండా 105 పరుగులు చేసింది. మయాంక్ అగర్వాల్ (102 బంతుల్లో 53 బ్యాటింగ్; 6 ఫోర్లు), కెప్టెన్ గౌతం గంభీర్ (105 బంతుల్లో 51 బ్యాటింగ్; 5 ఫోర్లు) క్రీజ్‌లో ఉన్నారు. రెడ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసినా వికెట్ పడగొట్టడంలో విఫలమయ్యారు. తొలి లీగ్ మ్యాచ్‌లో రెడ్ జట్టు గ్రీన్‌పై గెలిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement