ఎలెవన్ మాస్టర్ జట్టు బ్యాట్స్‌మన్ సంతోష్ (121) సెంచరీతో చెలరేగడంతో ఆ జట్టు 82 పరుగుల తేడాతో మాంచెస్టర్ జట్టుపై విజయం సాధించింది.
జింఖానా, న్యూస్‌లైన్: ఎలెవన్ మాస్టర్ జట్టు బ్యాట్స్‌మన్ సంతోష్ (121) సెంచరీతో చెలరేగడంతో ఆ జట్టు 82 పరుగుల తేడాతో మాంచెస్టర్ జట్టుపై విజయం సాధించింది. హెచ్‌సీఏ కిషన్ ప్రసాద్ వన్డే నాకౌట్ టోర్నీలో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఎలెవన్ మాస్టర్ 3 వికెట్లు కోల్పోయి 265 పరుగులు చేసింది.
	హరీష్ (72 నాటౌట్) అర్ధ సెంచరీతో అజేయంగా నిలవగా... నరేష్ 37 పరుగులు చేశాడు. అనంతరం లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన మాంచెస్టర్ 4 వికెట్ల నష్టానికి 183 పరుగులు మాత్రమే చేయగలిగింది. చరణ్ (66) అర్ధ సెంచరీతో రాణించగా... నదీమ్ 31 పరుగులు చేశాడు. మరో మ్యాచ్‌లో విజయ్ భరత్ జట్టు బౌలర్ నరసింహ (5/35) ప్రత్యర్థి జట్టుకు ముచ్చెమటలు పట్టించాడు. దీంతో ఆ జట్టు 4 వికెట్ల తేడాతో ఫ్యూచర్ స్టార్ జట్టుపై గెలుపొందింది. తొలుత బరిలోకి దిగిన ఫ్యూచర్ స్టార్ 132 పరుగులకే కుప్పకూలింది. కృష్ణ (37) మినహా మిగిలిన వారు రాణించలేకపోయారు. తర్వాత బ్యాటింగ్ చేసిన విజయ్ భారత్ 6 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసి నెగ్గింది. రాజ్ (37) ఫర్వాలేదనిపించాడు. ఫ్యూచ ర్ స్టార్ బౌలర్ కృష్ణ 3 వికెట్లు తీసుకున్నాడు.
	 
	 ఇతర మ్యాచ్‌ల స్కోర్లు
	 డెక్కన్ కోల్ట్స్: 158 ( ప్రతీక్ 108 ); ఎస్‌ఎన్ గ్రూప్: 102 ( సంతోష్ 3/12, కిషన్ 3/24).
	  సఫిల్‌గూడ: 161 ( నిరూప్ 4/20); గ్రీన్ టర్ఫ్: 164/7 (ఉదయ్ కిరణ్ రెడ్డి 64, చార్లెస్ 4/40).
	 
	 ఐఐసీటీ: 132 (శ్రీనివాస్ 33; రామకృష్ణ 4/28, సోహన్ 3/12); కన్సల్ట్: 137/2 (వికాస్ రావు 70).
	  హైదరాబాద్ పేట్రియాట్స్: 224 (మోసిన్ 45, అకీల్ అహ్మద్ 56, ఇమ్రోజ్ 39); ఓఎంసీ: 171 (శ్రీకాంత్ 31, హేమంత్ 31, వంశీ 42; అక్షయ్ 4/17, షాదాబ్ 4/8).
	 
	 ఎ-డివిజన్ రెండు రోజుల లీగ్
	  కొసరాజు: 137 (రిత్విక్ 54; ఫాహీమ్ 3/18); ఎస్‌ఏ అంబర్‌పేట్: 141/4 (రాకేష్ 58; అజయ్ పట్వారి 3/68).
	 
	 ఎ-ఇన్‌స్టిట్యూషన్ వన్డే లీగ్
	 ఐఏఎఫ్: 214 (శంకరీయ 110); ఎంసీహెచ్: 135 (అజీమ్ 50, జితేందర్  30; దీపక్ 5/21).
	 

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
