India vs England test: 18 నుంచి టికెట్ల విక్రయం | India vs England test: Hyderabad: India-England Test match ticket sale from January 18 | Sakshi
Sakshi News home page

India vs England test: 18 నుంచి టికెట్ల విక్రయం

Jan 15 2024 5:52 AM | Updated on Jan 15 2024 5:52 AM

India vs England test: Hyderabad: India-England Test match ticket sale from January 18 - Sakshi

అర్శనపల్లి జగన్‌మోహన్‌ రావు,

సాక్షి, హైదరాబాద్‌: భారత్, ఇంగ్లండ్‌ జట్ల మధ్య ఈనెల 25 నుంచి 29 వరకు ఉప్పల్‌ స్టేడియంలో జరిగే తొలి టెస్టు మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లను ఈనెల 18 నుంచి ఆన్‌లైన్‌లో విక్రయిస్తారు. పేటీఎం ఇన్‌సైడర్‌ యాప్‌లో,  www.insider.in వెబ్‌సైట్‌లో రాత్రి 7 గంటల నుంచి టికెట్లు లభిస్తాయని హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) అధ్యక్షుడు అర్శనపల్లి జగన్‌మోహన్‌ రావు ఆదివారం ప్రకటించారు. మిగిలిన టికెట్లను ఈనెల 22 నుంచి ఆఫ్‌లైన్‌లో సికింద్రాబాద్‌ జింఖానా మైదానంలో విక్రయిస్తామని ఆయన వివరించారు.

టికెట్ల ధరలను ఒక్కో రోజుకు రూ. 200, రూ. 499, రూ. 750, రూ. 1250, రూ. 3000 (కార్పొరేట్‌ బాక్స్‌ నార్త్‌), రూ. 4000 (కార్పొరేట్‌ బాక్స్‌ సౌత్‌)గా నిర్ణయించారు. ఐదు రోజుల సీజన్‌ టికెట్ల ధరలను రూ. 600, రూ. 1500, రూ. 2250, రూ. 3750, రూ. 12000 (కార్పొరేట్‌ బాక్స్‌ నార్త్‌), రూ. 16000 (కార్పొరేట్‌ బాక్స్‌ సౌత్‌)లుగా నిర్ణయించారు. ఆన్‌లైన్‌లో టికెట్లు కొనుగోలు చేసిన వారు ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డును చూపించి 22వ తేదీ నుంచి జింఖానా మైదానంలో టికెట్లను రీడీమ్‌ చేసుకోవాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement