మరోసారి బంగారు పతకం తెచ్చిన బామ్మ

Man Kaur Won 200m Gold Medal At World Master Athletics Championship - Sakshi

మాలాగా(స్పెయిన్‌): వరల్డ్‌ మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌లో 102 ఏళ్ల వృద్ధురాలు మన్‌ కౌర్‌ భారత్‌కు మరోసారి స్వర్ణం సాధించి పెట్టింది. గతంలో ఆమె 100 మీటర్ల పరుగుపందెంలో పాల్గొని విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా స్పెయిన్‌లోని మాలాగాలో జరిగిన చాంపియన్‌షిప్‌లో ఆమె 200 మీటర్ల పరుగుపందెంలో పాల్గొని విజయం సాధించారు. వరల్డ్‌ మాస్టర్‌ అథ్లెటిక్స్‌ని మాములుగా వయోవృద్ధుల ఒలంపిక్స్‌గా భావిస్తారు. 

కాగా కౌర్‌ సాధించిన విజయం పట్ల నెటిజన్లు సోషల్‌ మీడియాలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. బాలీవుడ్‌ నటుడు మిలింద్‌ సోమన్‌ కూడా కౌర్‌పై పొగడ్తల వర్షం కురిపించారు. ఇక్కడ విశేషమేమిటంటే సరిగా పదేళ్ల క్రితం వరకు కౌర్‌కు అథ్లెటిక్స్‌కు గురించి అసలు తెలియదు. ఆమెకు 93 ఏళ్ల ఉన్నప్పుడు అథ్లెటిక్స్‌లో ప్రవేశించారు. ఆమె కొడుకు గురుదేవ్‌ సింగ్‌ సూచన మేరకు ఆమె అథ్లెటిక్స్‌పై దృష్టి సారించారు. గురుదేవ్‌ కూడా ఈ గేమ్స్‌లో పాల్గొనడం విశేషం. 

చదవండి: 100 మీటర్ల రేసు విజేత.. 101 ఏళ్ల బామ్మ!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top