బోల్ట్ కంటే ధోని ‘రిచ్’ | Mahendra singh Dhoni rich than the Usain Bolt | Sakshi
Sakshi News home page

బోల్ట్ కంటే ధోని ‘రిచ్’

Aug 21 2013 1:01 AM | Updated on Sep 1 2017 9:56 PM

బోల్ట్ కంటే ధోని ‘రిచ్’

బోల్ట్ కంటే ధోని ‘రిచ్’

దిగ్గజ అథ్లెట్ బోల్ట్‌కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉండొచ్చు... కానీ సంపాదనలో మాత్రం భారత క్రికెటర్లతో పోలిస్తే చాలా వెనుకబడి ఉన్నాడు.

న్యూఢిల్లీ: దిగ్గజ అథ్లెట్ బోల్ట్‌కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉండొచ్చు... కానీ సంపాదనలో మాత్రం భారత క్రికెటర్లతో పోలిస్తే చాలా వెనుకబడి ఉన్నాడు. ‘ఫోర్బ్స్’ తాజాగా విడుదల చేసిన క్రీడాకారుల ఆదాయ జాబితాలో బోల్ట్ 40వ స్థానంలో ఉంటే... భారత క్రికెట్ కెప్టెన్ ధోని 16వ ర్యాంకులో, సచిన్ 31వ స్థానంలో ఉన్నారు.
 
 ఈ పత్రిక అంచనా ప్రకారం ఏడాదికి ధోని ఆదాయం 31.5 మిలియన్ డాలర్లు (రూ.195.3 కోట్లు). సచిన్ టెండూల్కర్ ఆదాయం 22 మిలియన్ డాలర్లు (రూ. 136.4 కోట్లు). బోల్ట్ ఆదాయం 20.3 మిలియన్ డాలర్లు (రూ. 126 కోట్లు). అత్యధిక ఆదాయం ఆర్జించే క్రీడాకారుల జాబితాలో విఖ్యాత గోల్ఫర్ టైగర్ వుడ్స్ 78.1 మిలియన్ డాలర్లు (రూ. 484.2 కోట్లు )తో అగ్రస్థానంలో ఉండగా... టెన్నిస్ దిగ్గజం ఫెడరర్ 71.5 మిలియన్ డాలర్లు (రూ. 443.3 కోట్లు )తో రెండో స్థానంలో ఉన్నాడు. మహిళల విభాగంలో రష్యన్ టెన్నిస్ స్టార్ షరపోవా 29 మిలియన్ డాలర్లు (రూ. 180 కోట్లు) ఆదాయంతో అగ్రస్థానంలో ఉంది.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement