ముర్రేకు షాక్‌ | Madrid Masters Tennis Tournament | Sakshi
Sakshi News home page

ముర్రేకు షాక్‌

May 12 2017 10:25 PM | Updated on Sep 5 2017 11:00 AM

ముర్రేకు షాక్‌

ముర్రేకు షాక్‌

స్పెయిన్‌లో జరుగుతున్న మాడ్రిడ్‌ మాస్టర్స్‌ టోర్నీలో ప్రపంచ నం.1 టెన్నిస్‌ ప్లేయర్‌ ఆండీ ముర్రే

మాడ్రిడ్‌ మాస్టర్స్‌ టెన్నిస్‌ టోర్నీ

మాడ్రిడ్‌: స్పెయిన్‌లో జరుగుతున్న మాడ్రిడ్‌ మాస్టర్స్‌ టోర్నీలో ప్రపంచ నం.1 టెన్నిస్‌ ప్లేయర్‌ ఆండీ ముర్రే (బ్రిటన్‌)కు చుక్కెదురైంది. భారత కాలమానం ప్రకారం గురువారం  జరిగిన పురుషుల సింగిల్స్‌ మూడోరౌండ్‌లో ముర్రే 3–6, 3–6తో ప్రపంచ 59వ ర్యాంకర్, బోర్నా కోరిక్‌ (క్రొయేషియా) చేతిలో పరాజయం పాలయ్యాడు. గంటన్నరపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థి సర్వీస్‌ను ఓసారి బ్రేక్‌ చేసిన ముర్రే.. తన సర్వీస్‌ను నాలుగుసార్లు కోల్పోయి మూల్యం చెల్లించుకున్నాడు. మరోవైపు ప్రపంచ మాజీ నం.1 నోవాక్‌ జకోవిచ్, రఫెల్‌ నాదల్‌ ముందంజ వేశారు. పురుషుల సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో రెండోసీడ్‌ జకోవిచ్‌ 6–4, 7–5తో ఫెలిసియానో లోపెజ్‌ (స్పెయిన్‌)పై, నాలుగో సీడ్‌ నాదల్‌ 6–3, 6–1తో నికీ కిర్గియోస్‌ (ఆస్ట్రియా)పై అలవోక విజయం సాధించారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement