లాథమ్ సెంచరీ | Latham century puts New Zealand on top against Zimbabwe | Sakshi
Sakshi News home page

లాథమ్ సెంచరీ

Jul 30 2016 12:27 AM | Updated on Sep 4 2017 6:57 AM

లాథమ్ సెంచరీ

లాథమ్ సెంచరీ

జింబాబ్వేతో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. టామ్ లాథమ్ (209 బంతుల్లో 105; 12 ఫోర్లు) సెంచరీతో చెలరేగడంతో...

న్యూజిలాండ్ 315/4
బులవాయే: జింబాబ్వేతో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. టామ్ లాథమ్ (209 బంతుల్లో 105; 12 ఫోర్లు) సెంచరీతో చెలరేగడంతో శుక్రవారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 100 ఓవర్లలో 4 వికెట్లకు 315 పరుగులు చేసింది. టేలర్ (38 బ్యాటింగ్), సోధి (5 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. 32/0 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆట కొనసాగించిన కివీస్ ఆరంభంలోనే గప్టిల్ (40) వికెట్ కోల్పోయింది. అయితే విలియమ్సన్ (179 బంతుల్లో 91; 9 ఫోర్లు) సమయోచితంగా ఆడుతూ లాథమ్‌కు చక్కని సహకారం అందించాడు.

ఈ ఇద్దరు రెండో వికెట్‌కు 156 పరుగులు జోడించారు. ఈ క్రమంలో లాథమ్ 200 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. శతకం దిశగా సాగుతున్న విలియమ్సన్‌ను క్రెమర్ అవుట్ చేశాడు. తర్వాత వచ్చిన టేలర్ నిలకడగా ఆడాడు. లాథమ్‌తో కలిసి మూడో వికెట్‌కు 37 పరుగులు జోడించాడు. నికోలస్ (18) నిరాశపర్చినా.. సోధి మరో వికెట్ పడకుండా రోజును ముగించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement