లలిత్ బాబుకు కాంస్యం | Lalith Babu bronze | Sakshi
Sakshi News home page

లలిత్ బాబుకు కాంస్యం

Jul 1 2015 2:54 AM | Updated on Sep 3 2017 4:38 AM

లలిత్ బాబుకు కాంస్యం

లలిత్ బాబుకు కాంస్యం

కామన్వెల్త్ చెస్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ఎం.ఆర్. లలిత్ బాబు కాంస్య పతకాన్ని సాధించాడు. మంగళవారం

కామన్వెల్త్ చెస్
 
న్యూఢిల్లీ : కామన్వెల్త్ చెస్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ఎం.ఆర్. లలిత్ బాబు కాంస్య పతకాన్ని సాధించాడు. మంగళవారం ముగిసిన ఈ టోర్నమెంట్ ఓపెన్ విభాగంలో నిర్ణీత తొమ్మిది రౌండ్ల తర్వాత లలిత్ బాబు 7.5 పాయింట్లతో ఆర్గ్యా దీప్ దాస్ (భారత్), దీపన్ చక్రవర్తి (భారత్)తో కలిసి ఉమ్మడిగా రెండో స్థానంలో నిలిచాడు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంక్‌ను వర్గీకరించగా... ఆర్గ్యాదీప్‌కు రెండో స్థానం, లలిత్‌కు మూడో స్థానం, దీపన్‌కు నాలుగో స్థానం దక్కింది.

భారత్‌కే చెందిన అభిజిత్ గుప్తా 8 పాయింట్లతో చాంపియన్‌గా అవతరించాడు. ఇదే టోర్నమెంట్ అండర్-14 బాలికల విభాగంలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి జి.హర్షిత 5.5 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సాధించింది.

Advertisement
 
Advertisement
Advertisement