మూడో శ్రీలంక ఆటగాడిగా..

Lahiru Thirimanne Complets Three Thousand Odi Runs - Sakshi

కార్డిఫ్‌: శ్రీలంక క్రికెటర్‌ లహిరు తిరిమన్నే అరుదైన క్లబ్‌లో చేరాడు. వన్డే ఫార్మాట్‌లో మూడు వేల పరుగుల మార్కును పూర్తి చేసుకున్నాడు. వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా అఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తిరిమన్నే మూడు వేల పరుగుల్ని పూర్తి చేసుకున్నాడు. ఆఫ్గాన్‌ కెప్టెన్‌ గుల్బాదిన్‌ నైబ్‌ వేసిన 15 ఓవర్‌ ఐదో బంతిని ఫోర్‌గా మలచడం ద్వారా తిరిమన్నే ఈ ఫీట్‌ను నమోదు చేశాడు. తొలుత ఆ బంతి నో బాల్‌ కావడంతో ఫ్రీ హిట్‌ అవకాశం వచ్చింది. దాన్ని బౌలర్‌ ఎండ్‌ వైపు ఫోర్‌గా కొట్టాడు. ఫలితంగా మూడు వేల పరుగుల క్లబ్‌లో చేరిపోయాడు. మరొకవైపు వేగవంతంగా మూడు వేల వన్డే పరుగుల మార్కును  చేరిన మూడో శ్రీలంక ఆటగాడిగా నిలిచాడు. తిరిమన్నే తన వందో ఇన్నింగ్స్‌లో ఈ మార్కును చేరితే, ఈ జాబితా ముందు వరుసలో తరంగా(92 ఇన్నింగ్స్‌లు), ఆటపట్టు(94 ఇన్నింగ్స్‌లు)లు వరుసగా ఉన్నారు.

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన అఫ్గానిస్తాన​ ముందుగా ఫీల్డింగ్‌ ఎంచుకుంది. దాంతో బ్యాటింగ్‌ చేపట్టిన లంక ఇన్నింగ్స్‌ను కెప్టెన్‌ దిముత్‌ కరుణరత్నే- కుశాల్‌ పెరీరాలు ఆరంభించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 92 పరుగులు జత చేసి మంచి ఆరంభాన్నిచ్చారు. కాగా,  తిరుమన్నే(30) భారీ షాట్‌కు యత్నించి తొలి వికెట్‌గా ఔటయ్యాడు. అఫ్గాన్‌ స్పిన్నర్‌ నబీ బౌలింగ్‌లో నజీబుల్లాకు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. 17 ఓవర్లు ముగిసే సరికి శ్రీలంక వికెట్‌ నష్టానికి 128 పరుగులు చేసింది. కుశాల్‌ పెరీరా హాఫ్‌ సెంచరీ సాధించాడు.

 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top