
శ్రీలంకతో మ్యాచ్‌లో అఫ్గనిస్తాన్ (SL vs AFG) వెటరన్ ఆల్‌రౌండర్ మహ్మద్ నబీ (Mohammad Nabi) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ప్రత్యర్థి జట్టు బౌలర్లకు చుక్కలు చూపిస్తూ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. సిక్సర్ల వర్షం కురిపిస్తూ ప్రేక్షకులను అలరించాడు.
ఫాస్టెస్ట్ ఫిఫ్టీ
కేవలం 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న నబీ.. అఫ్గనిస్తాన్ తరఫున ఫాస్టెస్ట్ ఫిఫ్టీ చేసిన ఆటగాడిగా అజ్మతుల్లా ఒమర్జాయ్ (హాంకాంగ్‌పై) రికార్డును సమం చేశాడు. ఇక లంకతో మ్యాచ్‌లో మొత్తంగా 22 బంతుల్లోనే మూడు ఫోర్లు, ఆరు సిక్స్‌లతో నబీ 60 పరుగులు రాబట్టాడు.
ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు
ముఖ్యంగా ఆఖరి ఓవర్లో నబీ వరుసగా ఐదు సిక్సర్లు బాదడం అఫ్గన్ ఇన్నింగ్స్‌కే హైలైట్‌గా నిలిచింది. లంక యువ స్పిన్నర్ దునిత్ వెల్లలగే బౌలింగ్‌లో వరుసగా మూడు సిక్సర్లు బాదిన నబీకి.. తర్వాత ఫ్రీ హిట్ రూపంలో మరో సిక్స్ లభించింది. ఆ తర్వాత బంతికి కూడా బంతిని బౌండరీ మీదుగా తరలించి.. మొత్తంగా ఐదు సిక్స్‌లు పిండుకున్నాడు.
యువీ రికార్డు.. జస్ట్ మిస్
ఈ క్రమంలో నబీ జోరు చూస్తే టీమిండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ ఆరు సిక్సర్ల రికార్డును సమం చేసేలా కనిపించాడు. అయితే, ఆ వెంటనే సింగిల్‌కు ప్రయత్నించిన నబీ.. దురదృష్టవశాత్తూ రనౌట్ అయ్యాడు. కాగా 2007 టీ20 ప్రపంచకప్ టోర్నీలో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో యువీ.. స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో వరుసగా ఆరు సిక్స్‌లు బాదిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే.. శ్రీలంకతో మ్యాచ్‌లో నబీ మెరుపులు వృథాగా పోయాయి. అఫ్గనిస్తాన్‌ను ఆరు వికెట్ల తేడాతో ఓడించిన శ్రీలంక.. గ్రూప్-బి నుంచి సూపర్-4కు అర్హత సాధించింది. అఫ్గన్‌ను ఎలిమినేట్ చేసి తమతో పాటు బంగ్లాదేశ్‌ను తదుపరి దశకు తీసుకువెళ్లింది.
శ్రీలంక వర్సెస్ బంగ్లాదేశ్ స్కోర్లు
👉వేదిక: షేక్ జాయేద్ స్టేడియం, అబుదాబి
👉టాస్: అఫ్గనిస్తాన్.. తొలుత బ్యాటింగ్
👉అఫ్గనిస్తాన్ స్కోరు: 169/8 (20)
👉శ్రీలంక స్కోరు: 171/4 (18.4)
👉ఫలితం: ఆరు వికెట్ల తేడాతో అఫ్గన్‌పై లంక గెలుపు
👉సూపర్-4కు శ్రీలంక అర్హత.. టోర్నీ నుంచి అఫ్గన్ నిష్క్రమణ.
చదవండి: Asia Cup: శ్రీలంక స్టార్ ఇంట్లో విషాదం.. మ్యాచ్ మధ్యలోనే తండ్రి మరణం
Mohammad Nabi lit up the Abu Dhabi skyline with some fireworks of his own 🎇💫
Watch the #DPWorldAsiaCup2025, from Sept 9-28, 7 PM onwards, LIVE on the Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #SLvAFG pic.twitter.com/nseqjt4zJJ— Sony Sports Network (@SonySportsNetwk) September 18, 2025