‘దశాబ్దపు ఫొటో’పై పీటర్సన్‌ కామెంట్‌ | Sakshi
Sakshi News home page

కోహ్లి ‘దశాబ్దపు ఫొటో’పై పీటర్సన్‌ కామెంట్‌

Published Thu, Dec 26 2019 5:17 PM

Kohli Shares Decade Old Photo, Pietersen Responds - Sakshi

న్యూఢిల్లీ: ఇటీవల విఖ్యాత క్రికెట్‌ మ్యాగజైన్‌ విజ్డెన్‌ ప్రకటించిన ఈ దశాబ్దపు టెస్టు కెప్టెన్‌గా టీమిండియా పరుగుల మెషీన్‌ విరాట్‌ కోహ్లి ఎంపిక కాగా, తాజాగా  విడుదల చేసిన తమ దశాబ్దపు అత్యుత్తమ క్రికెటర్ల జాబితాలో కూడా చోటు దక్కించుకున్నాడు. కాగా, ఐదు మందితో కూడిన ఈ జాబితాలో కోహ్లితో పాటు దక్షిణాఫ్రికా క్రికెటర్లు ఏబీ డివిలియర్స్‌, డేల్‌ స్టెయిన్‌లకు కూడా విజ్డెన్‌ దశాబ్దపు క్రికెటర్ల జాబితాలో స్థానం దక్కించుకున్నారు. ఇక ఆసీస్‌ నుంచి స్టీవ్‌ స్మిత్‌ చోటు దక్కించుకోగా,  ఇంగ్లండ్‌ మహిళా క్రికెటర్‌ ఎలెసీ పెర్రీ కూడా స్థానం దక్కింది.  

ఇదిలా ఉంచితే, ఈ దశాబ్దపు పాత-కొత్త ఫొటోను కోహ్లి తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేశాడు. తన టీనేజ్‌లో ఉన్నప్పుడు ఫొటోకు ప్రస్తుతం ఉన్న ఫొటోను జత చేశాడు కోహ్లి. అయితే తన పాత ఫొటోపై  ఇది తానేనా అన్నట్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఉన్న ఫొటోను జత చేయడమే కాకుండా ఒక కామెంట్‌ కూడా చేశాడు. ‘  క‍్రమేపీ పరివర్తన చెందడంపై ఇది నా రియాక్షన్‌. నా నిలకడైన క్లియర్‌ కట్‌ ఫెర్ఫార్మెన్స్‌కు ఇక్కడ ఫిలిప్స్‌ ట్రిమ్మర్‌కు థాంక్స్‌’ అంటూ పేర్కొన్నాడు. అయితే దీనిపై ఇంగ్లండ్‌ క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ స్పందించాడు. ‘ ఆ ఎడమవైపును కుర్రాడు ఎవరో నాకు గుర్తుంది’ అంటూ చమత్కరించాడు.

ఈ  దశాబ్దంలో తన సమకాలీన క్రికెటర్ల కంటే ఎక్కువ పరుగులు చేసిన జాబితాతో పాటు అత్యధిక సెంచరీల చేసిన లిస్ట్‌లో కూడా కోహ్లినే టాప్‌లో ఉన్నాడు. ఇక్కడ తన సమీప క్రికెటర్‌ కంటే కోహ్లి అత్యధికంగా 5,775 అంతర్జాతీయ పరుగులు చేయగా, ఇక సెంచరీల్లో 22 అధికంగా చేశాడు. మరొకవైపు 2010 నుంచి చూస్తే కోహ్లి 20,964 పరుగులు సాధించాడు.  అదే  సమయంలో క్రికెట్‌ చరిత్రలో మూడు ఫార్మట్లలో యాభైకి పైగా యావరేజ్‌ కల్గిన ఏకైక​ ఆటగాడిగా కోహ్లి అరుదైన రికార్డును లిఖించాడు. ఇప్పటివరకూ కోహ్లి వన్డేల్లో 11, 609 పరుగులు చేయగా, టెస్టుల్లో 7,202 పరుగులు చేశాడు. ఇక టీ20ల్లో 2,633 పరుగులు సాధించాడు.

Advertisement

తప్పక చదవండి

Advertisement