భారత్‌ స్టోక్స్‌.. పాండ్యానే.. | Kohli Compares Pandya to Stokes | Sakshi
Sakshi News home page

భారత్‌ స్టోక్స్‌.. పాండ్యానే..

Jul 30 2017 12:06 PM | Updated on Sep 5 2017 5:13 PM

భారత్‌ స్టోక్స్‌.. పాండ్యానే..

భారత్‌ స్టోక్స్‌.. పాండ్యానే..

భారత ఆల్‌రౌండర్‌ హార్ధిక్‌ పాండ్యాను టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి భారత్‌ స్టోక్స్‌గా అభివర్ణించాడు.

ఆడిన తొలి టెస్టులోనే ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఆకట్టుకున్న భారత ఆటగాడు హార్ధిక్‌ పాండ్యాను టీమిండియా కెప్టెన్‌ విరాట్‌  కోహ్లి భారత్‌ స్టోక్స్‌గా అభివర్ణించాడు. బ్యాటింగ్‌, బౌలింగ్‌తో ప్రపంచ గొప్ప ఆల్‌ రౌండర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఇంగ్లండ్‌ ప్లేయర్‌ బెన్‌ స్టోక్స్‌తో పాండ్యాను పోల్చుతూ ప్రశంసల జల్లు కురిపించాడు. మ్యాచ్‌ గెలిచిన అనంతరం మాట్లాడిన కోహ్లీ.. పాండ్యా స్టోక్స్‌లా రాణిస్తాడనడంలో ఎలాంటి సందేహం లేదని అభిప్రాయపడ్డాడు.
 
తొలి ఇన్నింగ్స్‌లో బౌలింగ్‌ అవకాశం తక్కువగా వచ్చినా రెండో ఇన్నింగ్స్‌లో దక్కిన అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడని కొనియాడాడు. వేగంతో కూడిన షార్ట్‌ పిచ్‌ బంతులు అద్భుతంగా వేయడం ఆకట్టుకుందని కోహ్లి చెప్పుకొచ్చాడు.  తొలి ఇన్నింగ్స్‌లో 540-550 మధ్యలోనే భారత్‌ ఇన్నింగ్స్‌ ముగుస్తుందని భావించామని.. కానీ పాండ్యా హాఫ్‌ సెంచరీతో భారీ స్కోరు నమోదైందని పేర్కొన్నాడు. గత రెండు సంవత్సరాలుగా భారత బౌలర్లు స్థిరంగా రాణిస్తున్నారని కోహ్లి వ్యాఖ్యానించాడు.
 
సెంచరీపై స్పందిస్తూ..
గత ఆస్ట్రేలియా సిరీస్‌, తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైన కోహ్లి.. రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించడంపై మాట్లాడుతూ.. వైఫల్యాలను టార్గెట్‌ చేస్తూ వేలిత్తి చూపేవారిని పట్టించుకోనని.. పరిస్థితుల తగ్గట్టు ఆడడమే తన కర్తవ్యమని కోహ్లి అభిప్రాయపడ్డాడు. సెకండ్‌ ఇన్నింగ్స్‌లో మేము కొంత ఆడాల్సిన అవసరం ఏర్పడింది.
 
ఆ పరిస్థితిని అభినవ్‌తో అందిపుచ్చుకున్నానని కోహ్లి తెలిపాడు. ఎన్ని మ్యాచుల్లో విఫలమయ్యానని ఎప్పుడూ లెక్కించుకోనని, అన్ని ఫార్మట్‌లు ఆడుతున్నప్పుడు ఏ ఫార్మట్‌లో ఎన్ని ఇన్నింగ్స్‌లు ఆడలేదని లెక్కించుకోవడం కష్టమని కోహ్లి అభిప్రాయపడ్డాడు. శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో భారత్‌ 304 పరుగులతో ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌ రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లీ(103 నాటౌట్‌) కెరీర్‌లో 17 వ సెంచరీ నమోదు చేశాడు. హార్ధిక్‌ పాండ్యా ఆడిన తొలి మ్యాచ్‌లోనే అర్ధ సెంచరీతో పాటు ఒక వికెట్‌ పడగొట్టాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement