టెస్టుల్లో కెఎల్ రాహుల్ తొలి సెంచరీ | kl rahul gets first century | Sakshi
Sakshi News home page

టెస్టుల్లో కెఎల్ రాహుల్ తొలి సెంచరీ

Jan 8 2015 9:45 AM | Updated on Sep 2 2017 7:24 PM

టెస్టుల్లో కెఎల్ రాహుల్ తొలి సెంచరీ

టెస్టుల్లో కెఎల్ రాహుల్ తొలి సెంచరీ

టెస్టుల్లో కెఎల్ రాహుల్ తొలి సెంచరీ

సిడ్నీ:  టీమిండియా ఓపెనర్ కెఎల్ రాహుల్ టెస్టుల్లో తొలి సెంచరీ(102) నమోదు చేశాడు. ఇక్కడ ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి టెస్టులో రాహుల్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. 253 బంతులను ఎదుర్కొన్నఈ కర్ణాటక ఓపెనర్ 11ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో శతకం పూర్తి చేసి నాటౌట్ గా క్రీజ్ లో ఉన్నాడు.

 

తను ఆడిన రెండో టెస్టులోనే సెంచరీ చేసిన క్రికెటర్ గా రాహుల్ రికార్డు నెలకొల్పాడు.  రాహుల్ కు జతగా విరాట్ కోహ్లీ(67) పరుగులతో క్రీజ్ లో  ఉన్నాడు. ప్రస్తుతం టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 230 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. అంతకుముందు రోహిత్ శర్మ(53) పరుగుల వద్ద పెవిలియన్ కు చేరిన సంగతి తెలిసిందే. వికెట్ నష్టానికి 71 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో  మూడు రోజు ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియా ఆచితూచి బ్యాటింగ్ కొనసాగిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement