సర్దార్ సింగ్‌కే పగ్గాలు | Kiwis tour to the Indian hockey team announcement | Sakshi
Sakshi News home page

సర్దార్ సింగ్‌కే పగ్గాలు

Sep 24 2015 1:10 AM | Updated on Sep 3 2017 9:51 AM

సర్దార్ సింగ్‌కే పగ్గాలు

సర్దార్ సింగ్‌కే పగ్గాలు

న్యూజిలాండ్‌తో జరిగే ఆరు మ్యాచ్‌ల హాకీ సిరీస్‌లో పాల్గొనే భారత పురుషుల జట్టును ప్రకటించారు. 21 మంది సభ్యులతో కూడిన ఈ బృందానికి సర్దార్ సింగ్ నాయకత్వం వహిస్తాడు

కివీస్ పర్యటనకు భారత హాకీ జట్టు ప్రకటన
 
 న్యూఢిల్లీ : న్యూజిలాండ్‌తో జరిగే ఆరు మ్యాచ్‌ల హాకీ సిరీస్‌లో పాల్గొనే భారత పురుషుల జట్టును ప్రకటించారు. 21 మంది సభ్యులతో కూడిన ఈ బృందానికి సర్దార్ సింగ్ నాయకత్వం వహిస్తాడు. గోల్ కీపర్ శ్రీజేష్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. అక్టోబరు 2 నుంచి 11 వరకు జరిగే ఈ పర్యటనలో ఆక్లాండ్, నెల్సన్, క్రైస్ట్‌చర్చ్ నగరాల్లో మ్యాచ్‌లను నిర్వహిస్తారు. తొలి రెండు మ్యాచ్‌లను న్యూజిలాండ్ ‘ఎ’తో ఆడనున్న భారత్, తర్వాతి నాలుగు మ్యాచ్‌లను న్యూజిలాండ్ జాతీయ జట్టుతో తలపడుతుంది. స్థానిక మేజర్ ధ్యాన్‌చంద్ జాతీయ స్టేడియంలో నిర్వహించిన శిక్షణ శిబిరం అనంతరం ఈ జట్టును ఎంపిక చేశారు.

‘గత రెండు వారాల్లో సమన్వయం, పాస్‌లు ఇచ్చి పుచ్చుకోవడం అంశాలపై సాధన చేశాం. ‘డి’ ఏరియాలోకి వెళితే గోల్ చేసే అవకాశాలను వదులుకోవద్దనే అంశంపై కూడా కసరత్తు చేశాం’ అని హై పెర్ఫార్మెన్స్ డెరైక్టర్, జట్టు చీఫ్ కోచ్ రోలంట్ ఓల్ట్‌మన్స్ తెలిపారు.

 భారత హాకీ జట్టు: పీఆర్ శ్రీజేష్, హర్జోత్ సింగ్ (గోల్ కీపర్లు), బీరేంద్ర లాక్రా, కొతాజిత్ సింగ్, వీఆర్ రఘునాథ్, జస్జీత్ సింగ్ కులార్, రూపిందర్ పాల్ సింగ్, గుర్జిందర్ సింగ్ (డిఫెండర్లు), సర్దార్ సింగ్, చింగ్లెన్‌సనా సింగ్, ఎస్‌కే ఉతప్ప, సత్బీర్ సింగ్, దేవిందర్ వాల్మీకి, మన్‌ప్రీత్ సింగ్, ధరమ్‌వీర్ సింగ్ (మిడ్ ఫీల్డర్లు), ఎస్‌వీ సునీల్, రమణ్‌దీప్ సింగ్, ఆకాశ్‌దీప్ సింగ్, మన్‌దీప్ సింగ్, లలిత్ ఉపాధ్యాయ్, నికిన్ తిమ్మయ్య (ఫార్వర్డ్స్).

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement