చెలరేగిన కెవిన్ గుప్తా | kevin gupta achieves 12 wickets for hps big victory | Sakshi
Sakshi News home page

చెలరేగిన కెవిన్ గుప్తా

Jul 18 2016 10:21 AM | Updated on Sep 4 2017 5:16 AM

హెచ్‌పీఎస్ బౌలర్ కెవిన్ గుప్తా (7/20, 5/32) దక్కన్ బ్లూస్ బ్యాట్స్‌మెన్‌ను బెంబేలెత్తించాడు.

సాక్షి, హైదరాబాద్: హెచ్‌పీఎస్ బౌలర్ కెవిన్ గుప్తా (7/20, 5/32) దక్కన్ బ్లూస్ బ్యాట్స్‌మెన్‌ను బెంబేలెత్తించాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 12 వికెట్లు తీసి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (బేగంపేట్) జట్టును గెలిపించాడు. ఎ-డివిజన్ రెండు రోజుల లీగ్‌లో ఆదివారం 58/5 ఓవర్‌నైట్ స్కోరుతో చివరి రోజు ఆట కొనసాగించిన దక్కన్ బ్లూస్ 86 పరుగులకే కుప్పకూలింది. కెవిన్ ధాటికి ఎవరూ నిలువలేకపోయారు.

తర్వాత ఫాలోఆన్ ఆడిన దక్కన్ బ్లూస్ రెండో ఇన్నింగ్స్‌లో 135 పరుగులకే ఆలౌటైంది. ఠాకూర్ హర్‌స్వర్దింగ్  (74) ఒంటరి పోరాటం చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో కెవిన్ 5 వికెట్లు తీశాడు. తర్వాత 33 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన హెచ్‌పీఎస్ 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. తొలి ఇన్నింగ్స్‌లో హెచ్‌పీఎస్ 189 పరుగులు చేసింది.
 
 ఇతర మ్యాచ్‌ల స్కోర్లు
 
 కొసరాజు తొలి ఇన్నింగ్స్: 338/7 (రోహన్ వార్కె 166 నాటౌట్, రాహుల్ 57), సాయి సత్య తొలి ఇన్నింగ్స్: 382/8 (శ్రీకరణ్ 103 నాటౌట్; నారాయణ 74, కృష్ణచరిత్ 57).
 
 తెలంగాణ తొలి ఇన్నింగ్స్: 145/9 డిక్లేర్డ్, డబ్ల్యూఎంసీసీ తొలి ఇన్నింగ్స్: 175/9 డిక్లేర్డ్, తెలంగాణ రెండో ఇన్నింగ్స్: 250/6 డిక్లేర్డ్ (రాజేశ్ నాయక్ 85), డబ్ల్యూఎంసీసీ రెండో ఇన్నింగ్స్: 143/7 (యశ్వంత్ బాబు 71; సురేశ్ 3/23).

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement