కుక్కలకూ జెర్సీలు! | jerseys from Dog | Sakshi
Sakshi News home page

కుక్కలకూ జెర్సీలు!

Jun 24 2014 1:35 AM | Updated on Oct 22 2018 5:58 PM

ఫుట్‌బాల్‌పై అభిమానాన్ని బ్రెజిల్ ప్రజలు రకరకాలుగా చూపిస్తున్నారు.

ఫుట్‌బాల్‌పై అభిమానాన్ని బ్రెజిల్ ప్రజలు రకరకాలుగా చూపిస్తున్నారు. పురుషులు టీ షర్ట్‌లు, జెర్సీలతో హంగామా చేస్తుంటే, మహిళలు చేతి గోళ్లకు బ్రెజిల్ దేశపు రంగులు పెయింట్ చేయించుకోవడం, చేతి పర్సులపై ఆ దేశపు డిజైన్లు వేయించుకోవడం చేస్తున్నారు. ఇక మరి కొందరు ముందుకెళ్లి తమ కుక్కలపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు.

ముఖ్యంగా 10 నంబర్ రాసి ఉన్న పసుపు రంగు జెర్సీ ఇప్పుడు శునక బృందంలోనూ హాట్..! 14 డాలర్ల విలువ గల ఈ హాఫ్ షర్ట్‌ను తమ ఫ్యామిలీ డాగ్‌కు తొడిగి యజమానులు సంతోషపడుతున్నారు. ఇదో రకమైన వింత ధోరణిగా కనిపిస్తున్నా... తమకు లాభిస్తోందని అక్కడి వ్యాపారులు అంటున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement