ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్‌లో భారత షూటర్ జీతూ రాయ్ త్రుటిలో కాంస్య పతకాన్ని చేజార్చుకున్నాడు.
మ్యూనిచ్: ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్‌లో భారత షూటర్ జీతూ రాయ్ త్రుటిలో కాంస్య పతకాన్ని చేజార్చుకున్నాడు. ఆదివారం జరిగిన పురుషుల 50 మీటర్ల పిస్టల్ ఈవెంట్ ఫైనల్లో జీతూ రాయ్ 149.7 పాయింట్లు స్కోరు చేసి నాలుగో స్థానంలో నిలిచాడు.
పాబ్లో కరెరా (స్పెయిన్-193.9 పాయింట్లు) స్వర్ణం సాధించగా... వీ పాంగ్ (చైనా-190.3 పాయింట్లు) రజతం, జిన్ జోంగో (కొరియా-170.4 పాయింట్లు) కాంస్యం గెలుపొందారు. మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్ సెమీఫైనల్లో భారత షూటర్ అనీసా సయ్యద్ ఆరో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత పొందలేకపోయింది.