ఐపీఎల్‌కు బూమ్రా దూరం? | Jasprit Bumrah likely to be given ample rest of IPL ahead of World Cup | Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌కు బూమ్రా దూరం?

Jan 1 2019 2:50 PM | Updated on Jan 1 2019 2:51 PM

Jasprit Bumrah likely to be given ample rest of IPL ahead of World Cup - Sakshi

జస్ప్రిత్‌ బూమ్రా(ఫైల్‌ఫొటో)

న్యూఢిల్లీ: వచ్చే వరల్డ్‌కప్‌కు సన్నద్ధమయ్యే క్రమంలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ క్రికెట్‌ జట్లుకు చెందిన పలువురు కీలక ఆటగాళ్లు ఐపీఎల్‌కు దూరం కానున్న సంగతి తెలిసిందే. ఇదే తరహాలో భారత్‌కు చెందిన కీలక బౌలర్లకు విశ్రాంతి కల్పించాలని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఇటీవలే బీసీసీఐ పరిపాలక కమిటి(సీఓఏ)ముందు తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. కోహ్లి సూచనపై సీరియస్‌గా దృష్టి సారించిన బోర్డు పెద్దలు ఇప్పుడు అదే పనిలో ఉన్నారు.

ప్రధానంగా కీలక బౌలర్లకు ఐపీఎల్‌ నుంచి విశ్రాంతి కల్పించాలనే యోచనలో ఉన్నారు. రాబోయే సీజన్‌లో ముంబై ఇండియన్స్ జట్టు బుమ్రా సేవలను కోల్పోయే అవకాశం ఉందనే విషయాన్ని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు సూత్రప్రాయంగా వెల‍్లడించారు. ఈ క్రమంలోనే త్వరలోనే ముంబై ఇండియన్స్‌ యాజమాన్యంతో బీసీసీఐ మాట్లాడనున్నట్లు తెలుస్తోంది. కాగా, ఒకవేళ బుమ్రా ఫిట్‌గా ఉంటే కీలక మ్యాచ్‌ల్లో ఆడించి మిగతా మ్యాచ్‌ల్లో విశ్రాంతి కల్పించాలని బీసీసీఐ ఆలోచన చేస్తోంది. ముఖ్యంగా ముంబై ఇండియన్స్‌ ప్లే ఆఫ్‌ దశకు చేరిన పక్షంలో బూమ్రాను ఆడించే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement