వైస్ కెప్టెన్ గా అండర్సన్ | James Anderson to replace Ben Stokes as vice captain in Ashes | Sakshi
Sakshi News home page

వైస్ కెప్టెన్ గా అండర్సన్

Nov 10 2017 1:42 PM | Updated on Nov 10 2017 1:42 PM

James Anderson to replace Ben Stokes as vice captain in Ashes - Sakshi

లండన్:త్వరలో ప్రారంభమయ్యే యాషెస్ సిరీస్ లో భాగంగా ఇంగ్లండ్ జట్టు వైస్ కెప్టెన్ గా జేమ్స్ అండర్సన్ ఎంపికయ్యాడు. యాషెస్ కు బెన్ స్టోక్స్ దూరమవుతున్న నేపథ్యంలో అతని స్థానంలో అండర్సన్ ను వైస్ కెప్టెన్ గా నియమిస్తూ ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) నిర్ణయం తీసుకుంది.

ప్రస్తుత ఇంగ్లండ్ క్రికెట్ జట్టులో సీనియర్ ఆటగాడైన అండర్సన్ కు అదనంగా మరో బాధ్యతను అప్పచెప్పినట్లు పేర్కొంది. అటు టెస్టుల్లో, ఇటు వన్డేల్లో ఇంగ్లండ్ తరపున అత్యధిక వికెట్లు సాధించిన ఘనత అండర్సన్ ది.  యాషెస్ సిరీస్ లో తొలి  టెస్టు నవంబర్ 23వ తేదీన ఆరంభం కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement