మరో స్వర్ణం గెలిచిన ఇష్వి | Ishwini won another gold | Sakshi
Sakshi News home page

మరో స్వర్ణం గెలిచిన ఇష్వి

Nov 14 2017 12:37 AM | Updated on Nov 14 2017 12:37 AM

Ishwini won another gold - Sakshi

వరంగల్‌ స్పోర్ట్స్‌: తెలంగాణ రాష్ట్ర స్థాయి స్కూల్స్‌ స్విమ్మింగ్‌ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్‌ స్విమ్మర్‌ ఇష్వి మతాయ్‌ మెరిసింది. హన్మకొండలో జరుగుతున్న ఈ పోటీల్లో సోమవారం ఇష్వి అండర్‌– 14 కేటగిరీ 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌ రేసులో నిమిషం 25 సెకన్లలో గమ్యానికి చేరి విజేతగా నిలిచి స్వర్ణాన్ని గెలిచింది. తొలి రోజు ఇష్వి 50 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌ రేసులో బంగారు పతకం, ఫ్రీస్టయిల్‌ 50 మీటర్ల రేసులో కాంస్య పతకాన్ని సాధించింది. 

తాజా ప్రదర్శనతో ఇష్వి ఈ నెల 24 నుంచి 28వ తేదీ వరకు న్యూఢిల్లీలో జరగనున్న జాతీయ స్థాయి పోటీల్లో రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించనుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement