ఇష్వికి స్వర్ణం, రెండు రజతాలు | Ishviki gets Gold and Two Silvers | Sakshi
Sakshi News home page

ఇష్వికి స్వర్ణం, రెండు రజతాలు

Dec 1 2018 10:01 AM | Updated on Dec 1 2018 10:01 AM

Ishviki gets Gold and Two Silvers - Sakshi

దుండిగల్‌: తెలంగాణ రాష్ట్ర స్విమ్మింగ్‌ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్‌ అమ్మాయి ఇష్వి మతాయ్‌ సత్తా చాటింది. బౌరంపేటలోని జీయాన్‌ స్పోర్ట్స్‌ స్విమ్మింగ్‌ అకాడమీలో జరిగిన ఈ టోర్నీలో ఒక స్వర్ణం, రెండు రజతాలు సహా మొత్తం 3 పతకాలను గెలుచుకుంది. శుక్రవారం జరిగిన బాలికల 200మీ. విభాగంలో విజేతగా నిలిచి పసిడి పతకాన్ని అందుకున్న ఇష్వి... 50మీ., 100మీ. విభాగాల్లో రన్నరప్‌గా నిలిచి రెండు రజత పతకాలు సొంతం చేసుకుంది.

బాలుర విభాగంలో యశ్వంత్‌ రెడ్డి ‘బెస్ట్‌ స్విమ్మర్‌’ అవార్డును అందుకున్నాడు. రంగారెడ్డి జట్టు ఓవరాల్‌ చాంపియన్‌గా నిలిచింది. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో పాఠశాల క్రీడా సమాఖ్య (ఎస్‌జీఎఫ్‌) జిల్లా కార్యదర్శి జగదీశ్వర్‌ రెడ్డి, ‘పెటా’ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. రాఘవ రెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేసి విజేతలకు పతకాలను అందజేశారు.  

Advertisement
 
Advertisement
Advertisement