తండ్రీ తనయ.. ‘సన్‌’ విజయ..

IPL Sunrisers Hyderabad Beats Kolkata Knight Riders - Sakshi

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మరో విజయంతో ముందడుగు వేసింది. ఉప్పల్‌ స్టేడియంలో ఆదివారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. మ్యాచ్‌ అనంతరం వార్నర్‌ తన కూతురును భుజాలపై ఎక్కించుకొని స్టేడియంలో సందడి చేశారు. హీరో విక్టరీ వెంకటేశ్, టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా మ్యాచ్‌కు హాజరై ప్రేక్షకుల్లో ఉత్సాహం నింపారు.  

సాక్షి, హైదరాబాద్‌ :భాగ్యనగరంలో ఆదివారం క్రికెట్‌ సందడి నెలకొంది. ఉప్పల్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో కోల్‌కతా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్ల మధ్య మ్యాచ్‌ ప్రేక్షకులకు వినోదాన్ని పంచింది. సెలవుదినం కావడంతో క్రికెట్‌ వీరాభిమానులంతా పెద్ద సంఖ్యలో స్టేడియానికి తరలి వచ్చారు. వార్నర్‌–బెయిర్‌స్టో జోడీ అందించిన పరుగుల విందును మనసారా ప్రేక్షకులు ఆస్వాదించారు. సామాన్యులతో పాటు స్టార్లు కూడా ఈ మ్యాచ్‌లో అలరించారు. భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా, తన సోదరి ఆనమ్‌తో కలసి మ్యాచ్‌లో సందడి చేయగా... సినీ హీరో వెంకటేశ్‌ సన్‌రైజర్స్‌ జెండాతో అభిమానులను ఉత్తేజపరిచాడు.  
  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top