'మన టాప్-3నే అత్యుత్తమం'

India's Top 3 Batsmen Are The World's best

నాగ్ పూర్:ప్రస్తుత ప్రపంచ క్రికెట్ లో టాప్-3 టీమిండియా క్రికెటర్లే అత్యుత్తమమని మాజీ కెప్టెన్ సునీల్ గావస్కర్ అభిప్రాయపడ్డారు. మన టాపార్డర్ మరింత పటిష్టం కావడానికి తొలి ముగ్గురు ఆటగాళ్లే కీలకంగా మారారని స్పష్టం చేశారు. భారత జట్టు భారీ స్కోరు సాధించడంలో  రోహిత్-రహానే, ధావన్-రోహిత్ జోడిలతో పాటు కెప్టెన్ విరాట్ కోహ్లి ఒక కారణంగా గావస్కర్ పేర్కొన్నారు.

'భారత బ్యాటింగ్ ఆర్డర్ నాలుగు నుంచి ఏడు వరకూ చూడండి. అక్కడ విపరీతమైన మార్పులు జరుగుతూనే ఉన్నాయి. అంటే టాప్-3 పటిష్టంగా ఉన్న కారణంగానే నాలుగు నుంచి ఏడు స్థానాల్లో పదే పదే మార్చాల్సి వస్తుంది. శిఖర్-రోహిత్, రోహిత్-రహానే జోడితో పాటు మూడో ఫస్ట్ డౌన్ లో బ్యాటింగ్ కు వచ్చే విరాట్ కోహ్లిలు ఎక్కువ శాతం పరుగులు వర్షం కురిపిస్తున్నారు. దాంతోనే నాల్గో స్థానంలో వచ్చే ఆటగాడు 30 నుంచి 40 ఓవర్ల మధ్య రావాల్సి వస్తుంది. అప్పుడు ఎక్కువ సమయం తీసుకోవడానికి ఆస్కారం ఉండదు. వరల్డ్ క్రికెట్ లో మన టాప్-3 అత్యుత్తమం'అని గావస్కర్ విశ్లేషించాడు.

Back to Top