భారత్‌కు రెండో గెలుపు | India's second win     Inspections hockey series | Sakshi
Sakshi News home page

భారత్‌కు రెండో గెలుపు

Jun 11 2014 1:03 AM | Updated on Sep 2 2017 8:35 AM

మలేసియాతో జరుగుతున్న హాకీ టెస్టు సిరీస్‌లో భారత మహిళల జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది.

మలేసియాతో హాకీ సిరీస్
 

కౌలాలంపూర్: మలేసియాతో జరుగుతున్న హాకీ టెస్టు సిరీస్‌లో భారత మహిళల జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో 2-0తో ఆతిథ్య మలేసియాను ఓడించింది. దీంతో ఆరు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 2-0 ఆధిక్యంలో నిలిచింది. అనురాధ దేవి (10వ ని.), పూనమ్ రాణి (28వ ని.)లు భారత్ తరఫున గోల్స్ చేశారు.

ప్రారంభం నుంచి మెరుగ్గా ఆడిన టీమిండియా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంది. రెండో అర్ధభాగంలో స్కోరును సమం చేసేందుకు మలేసియా చేసిన అటాకింగ్‌ను భారత గోల్ కీపర్ సమర్థంగా అడ్డుకుంది. ఇరుజట్ల మధ్య మూడో మ్యాచ్ గురువారం జరగనుంది.     
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement